Bigg Boss Telugu 5: అమ్మా.. క్యాన్సర్‌తో పోరాడి బతికావు.. నువ్వే నాకు స్ఫూర్తి..! - bigg boss telugu 5 nominations fever started
close
Updated : 25/10/2021 16:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bigg Boss Telugu 5: అమ్మా.. క్యాన్సర్‌తో పోరాడి బతికావు.. నువ్వే నాకు స్ఫూర్తి..!

Bigg Boss Telugu 5: తెలుగు రియాల్టీషో బిగ్‌బాస్‌-5లో ఈ వారం నామినేషన్స్‌ ప్రక్రియ హౌస్‌మేట్స్‌నే కాదు, ప్రేక్షకులను కంటతడి పెట్టించేలా ఉండబోతోందని, తాజా ప్రోమో చూస్తే అర్థమవుతోంది. ఈసారి నామినేషన్‌ ప్రక్రియను సరికొత్త డిజైన్‌ చేసింది బిగ్‌బాగ్‌ టీమ్‌. ‘ఈ రోజు నుంచి మీకు ఎంతో ప్రియమైన వారి నుంచి ఒక లేఖను పొందే అవకాశం వస్తుంది. కానీ, జీవితంలో మనం కోరుకున్నది ప్రతిదీ, మనకు దక్కదు. దానికి బదులుగా ఏదైనా వదులుకోవాల్సి వస్తుంది. ఎవరికైతే పవర్‌ రూమ్‌లో ఉన్న సభ్యులు లేఖను ఇస్తారో వారు ఈ వారం నామినేషన్‌ నుంచి సేవ్‌ అవుతారు. లేఖ లభించని సభ్యులు నామినేట్‌ అవుతారు’ అంటూ బిగ్‌బాస్‌ చెప్పాడు.

ఈ సందర్భంగా హౌస్‌మేట్స్‌ తమకు వచ్చిన లేఖలను చూసి భావోద్వేగానికి గురయ్యారు. ‘ఇన్ని సంవత్సరాల నుంచి మా నాన్నగారితో సరిగా మాట్లాడలేదు’ అని ప్రియాంక అంటుంటే లోబో కన్నీటి పర్యంతమయ్యాడు. ‘నువ్వు చూసుకోవడానికి పాప, వదిన పేపర్లు ఉన్నాయి. వాడికి ఏమీ రాలేదు కదా’ అని లోబో చెప్పుకొచ్చాడు. ‘అమ్మా.. క్యాన్సర్‌ సర్వైవ్‌ అయ్యావు.. అమ్మమ్మ చనిపోయినప్పుడూ సర్వైవ్‌ అయ్యావు.. నువ్వే నా ఇన్‌స్ప్రేషన్‌.. ఐ విల్‌ సర్వైవ్‌ దిస్‌’ అంటూ సన్నీ ఏడుస్తూ తనకొచ్చిన లెటర్‌ను త్యాగం చేశాడు. మరి ఎవరు ఏం కోరుకున్నారు? ఏం వదులుకున్నారు? ఈవారం ఎవరు నామినేట్‌ అయ్యారో తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్‌ చూడాల్సిందే!




Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని