రూలంటే రూలే: క్వారంటైన్‌కు సల్మాన్‌ సోదరులు - bmc officials send salman khan brothers sent to quarantine
close
Published : 05/01/2021 16:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రూలంటే రూలే: క్వారంటైన్‌కు సల్మాన్‌ సోదరులు

తరలించిన బీఎంసీ అధికారులు

ముంబయి: కొవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించినందుకు ప్రముఖ బాలీవుడ్ హీరో సల్మాన్‌ ఖాన్‌ కుటుంబసభ్యులను ముంబయి అధికారులు క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు. బాలీవుడ్‌ నటుడు నిర్మాత సొహైల్‌ ఖాన్, ఆయన కుమారుడు నిర్వాణ్‌ ఖాన్‌, మరో సోదరుడు అర్బాజ్‌ఖాన్‌లపై పోలీసు కేసు కూడా నమోదు చేశారు.

బ్రిటన్‌లో కొత్త కరోనా రకం వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కొవిడ్‌ నియమాలను కఠినంగా అమలు చేస్తోంది. వీటిలో భాగంగా  బ్రిటన్‌, యూఏఈ, యూరోపియన్‌ దేశాలనుంచి తిరిగి వచ్చిన వారు.. ఏడురోజుల పాటు తప్పనిసరిగా ఇన్‌స్టిట్యూషనల్‌ క్వారంటైన్‌లో ఉండాలి. కాగా, ప్రభుత్వం ఆమోదించిన హోటళ్లలో కూడా ఈ సమయాన్ని గడిపేందుకు అనుమతించారు.

ఈ నియమాలను ఉల్లంఘించారని సల్మాన్‌ కుటుంబ సభ్యులపై బీఎంసీ వైద్యాధికారి ఒకరు ఫిర్యాదు చేశారు. దుబాయి నుంచి డిసెంబర్‌ 25న తిరిగి వచ్చిన వీరు .. హోటల్‌లో క్వారంటైన్‌ సమయాన్ని గడిపేందుకు బదులుగా తమ ఇంటికే వెళ్లిపోయారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో అంటువ్యాధుల చట్టం సెక్షన్ 188 కింద నగరంలోని ఖార్‌ పోలీస్‌ స్టేషన్‌లో సొహైల్‌, ఆర్బాజ్‌, నిర్వాణ్‌లపై సోమవారం ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు. అనంతరం వారిని క్వారంటైన్‌లో ఉంచేందుకు నగరంలోని తాజ్‌ ల్యాండ్స్‌ ఎండ్‌ హోటల్‌కు తరలించారు.

ఇవీ చదవండి..

మైనే ప్యార్‌ కియాలో నటించొద్దనుకున్నా..

కిసాన్‌గా సోనూసూద్‌..మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని