close

తాజా వార్తలు

Published : 03/12/2020 01:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దర్శకుడిని పరిగెత్తించిన కీర్తి.. బీచ్‌లో శ్రుతి

సోషల్‌ లుక్‌: సెలబ్రిటీలు షేర్‌ చేసిన విశేషాలు

* కథానాయిక కీర్తి సురేశ్‌ దర్శకుడు వెంకీ అట్లూరిని పరుగులు పెట్టించారు. ఆమె, నితిన్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘రంగ్‌దే’. ఈ సినిమా సెట్‌లో తీసిన ఫన్నీ వీడియోను కీర్తి షేర్‌ చేశారు.

* తన ముద్దుల కుమార్తెలు అరి, వివిల పుట్టినరోజు సందర్భంగా మంచు విష్ణు శుభాకాంక్షలు తెలిపారు. ‘నా చిట్టి తల్లులకు హ్యాపీ బర్త్‌డే. చాలా త్వరగా ఎదిగిపోయారు. మీరు నా జీవితంలో పోషించిన పాత్రను మాటల్లో వర్ణించలేను...’ అంటూ ఫొటోలు పంచుకున్నారు.

* జిమ్‌లో తెగ కసరత్తులు చేస్తున్నారు రష్మిక. గతంలో కంటే ఎంతో ఫిట్‌గా తయారైన ఆమె వ్యాయామం చేస్తున్న వీడియో షేర్‌ చేశారు. ‘వర్కౌట్‌ చేయడానికి ప్రేరణ అవసరమా? నన్ను చూసి నేర్చుకోండి..’ అని క్యాప్షన్‌ ఇచ్చారు.

* తన సోదరి రంగోలీ జన్మదినం సందర్భంగా కంగనా రనౌత్‌ కుక్కపిల్లను కానుకగా ఇచ్చారు. ‘మై వన్‌ అండ్‌ ఓన్లీ..’ అంటూ ప్రత్యేకంగా విష్‌ చేశారు. తమ కుటుంబంలో మరొకరు చేరారంటూ ఫొటోలు షేర్‌ చేశారు.

* గత కొన్ని రోజులుగా అవికా గోర్‌ డ్యాన్స్‌తో ఫాలోవర్స్‌ను ఆకట్టుకుంటున్నారు. కొరియోగ్రాఫర్‌తో కలిసి నృత్యం చేసిన వీడియోల్ని వరుసగా షేర్‌ చేస్తున్నారు. వీటికి నెటిజన్ల నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది.

















Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని