హిందీ ‘చత్రపతి’కి రంగం సిద్ధం - chatrapathi hindi remake to launch tomorrow
close
Published : 16/07/2021 01:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హిందీ ‘చత్రపతి’కి రంగం సిద్ధం

ఇంటర్నెట్‌ డెస్క్‌: మరో టాలీవుడ్‌ హీరో బాలీవుడ్‌లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే విజయ్‌ దేవరకొండ వంటి పలువురు టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు హిందీలో తమకంటూ ఓ క్రేజ్‌ తెచ్చుకున్నారు. తాజాగా బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ బాలీవుడ్‌లో ఎంట్రీకి రంగం సిద్ధమైంది. శుక్రవారం జరిగే పూజా కార్యక్రమంతో ‘చత్రపతి’ రీమేక్‌ పట్టాలెక్కనుంది. ప్రభాస్‌ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘చత్రపతి’ ఇక్కడ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇదే చిత్రాన్ని ఇప్పుడు హిందీలో రీమేక్‌ చేయనున్నారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ హీరోగా వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. BSS9 వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ముంబయిలో ఈ తొలిపూజ కార్యక్రమం ఉంటుందని నిర్మాణ సంస్థ పెన్‌ స్టూడియోస్‌ ప్రకటించింది. హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ను ‘అల్లుడు శీను’ చిత్రంతో తెలుగులోనూ వినాయక్‌ దర్శకత్వంలోనే పరిచయం చేయడం విశేషం.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని