చిట్టి ది సెన్సేషన్‌! - chitti special article
close
Published : 02/04/2021 09:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిట్టి ది సెన్సేషన్‌!

వెండి తెరపై ‘చిట్టి’ ప్రభావం

ఎఫ్.ఎం. ఆన్‌ చేసినా.. యూ ట్యూబ్‌ ఓపెన్‌ చేసినా.. టీవీ పెట్టినా.. ట్విటర్‌ తెరిచినా.. ఎందులో చూసినా ‘చిట్టి’ పాటే. ఎక్కడ విన్నా ‘చిట్టి’ మాటే. అంతలా ‘జాతి రత్నాలు’ చిత్రంలో చిట్టి పాత్ర పోషించి ‘చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే’ అని అందరూ పాడుకునేలా చేసింది యువ నాయిక ఫరియా అబ్దుల్లా. నవీన్‌ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలోని చిట్టి పాట, చిట్టి పాత్ర ప్రేక్షకులపై మంచి ప్రభావం చూపాయి. ఇప్పుడే కాదు గతంలో వచ్చిన కొన్ని చిత్రాల్లో చిట్టి పేరు అలరించింది. మరి ఆ ‘చిట్టి’ జాబితాని గుర్తు చేసుకుందామా...

చిరు చిట్టి...

‘శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌’ సినిమాలో డాక్టర్‌ సునీత అలియాస్‌ చిట్టిగా కనిపించి సందడి చేసింది సోనాలి బింద్రే. చిరంజీవి హీరోగా జయంత్‌ సి. పరాన్జీ తెరకెక్కించిన చిత్రమిది. సోనాలిబింద్రేనే చిట్టి అని తెలియక అన్నీ విషయాలు ఆమెతో పంచుకుంటారు చిరంజీవి. క్లైమాక్స్‌లో అసలు విషయం తెలిసిన తర్వాత చిరు పలికించే హావభావాలు గిలిగింతలు పెడతాయి.

ప్రభాస్‌ చిట్టి..

‘బుజ్జిగాడు’ చిత్రంలో మేఘన అలియాస్‌ చిట్టి పాత్ర పోషించింది త్రిష. ప్రభాస్‌ కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. చిన్నప్పుడు చిట్టి అన్న మాటను సీరియస్‌గా తీసుకుని విశాఖపట్నం విడిచి వెళ్లిపోతాడు ప్రభాస్‌. ఆ తర్వాత కొన్నేళ్లకు తిరిగి వస్తాడు. అయితే, ఈ క్రమంలో త్రిషనే చిట్టి అని తెలిసిన తర్వాత ప్రభాస్‌ ఆట పట్టించే సన్నివేశాలు నవ్వుల పువ్వులు పూయిస్తాయి.

చిట్టి ది రోబో..

చిట్టి ది రోబాట్‌ డాట్‌ అంటూ ‘రోబో’, ‘2. ఓ’ చిత్రాలతో రజనీకాంత్‌ ఎంతటి సంచలనం సృష్టించారో తెలిసిందే. రోబో అంటే చిట్టి.. చిట్టి అంటే రోబో అనేంతగా ఆ పాత్రలో ఒదిగిపోయారు. ఇక చిట్టి రోబోగా రజనీ చేసే పనులు, సాహసాలు, ఫైట్స్‌ చివరి విధ్వంసం కూడా ప్రేక్షకులను కట్టిపడేసింది. శంకర్‌ దర్శకత్వంలో ఈ చిత్రాలు రూపొందాయి. ‘చిట్టి.. చిట్టి.. రోబో’ పాట గురించి ప్రత్యేకంగా చెప్పాలా?

రంగస్థలం చిట్టిబాబు..

చిట్టిబాబుగా తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు రామ్‌చరణ్‌. సుకుమార్‌ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘రంగస్థలం’. ఇందులో సౌండ్‌ ఇంజినీర్‌ చిట్టిబాబుగా పాత్రలో ఒదిగిపోయారు. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకూ చిట్టిబాబు తప్ప ఎక్కడా మనకు రామ్‌చరణ్‌ కనిపించడు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని