కేటీఆర్‌ బర్త్‌డే: చిరు, పవన్‌ ఏమన్నారంటే! - cinema stars birthday wishes to ktr
close
Updated : 24/07/2020 13:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కేటీఆర్‌ బర్త్‌డే: చిరు, పవన్‌ ఏమన్నారంటే!

హైదరాబాద్‌: తెలంగాణ ఐటీశాఖ మంత్రి, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.తారకరామారావు(కేటీఆర్‌) పుట్టినరోజు సందర్భంగా సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి పుట్టినరోజులు కేటీఆర్‌ మరిన్ని జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అగ్ర కథానాయకుడు చిరంజీవి ట్విటర్‌ వేదికగా స్పెషల్‌ విషెస్‌ తెలిపారు. కేటీఆర్‌తో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నారు.

‘‘డియర్‌ తారక్‌.. హ్యాపీబర్త్‌డే. సహాయం కోసం వేచి చూసే పౌరుల కోసం నిరంతరం మీరు పడే తపన, వ్యక్తిగతంగా చొరవ చూపి వారికి సాయం చేసే తీరు చూసి నాకెంతో సంతోషంగా ఉంటుంది. ప్రజలకు మరింత సేవ చేసేందుకు, మరిన్ని సంవత్సరాల పాటు, ఆ శక్తిని భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నా’’ -ట్విటర్‌లో చిరంజీవి

‘‘నా సోదరుడు కేటీఆర్‌కు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.  ఈ ప్రత్యేకమైన రోజున ఆ చిలుకూరి బాలాజీ మీకు సంపూర్ణ ఆరోగ్యం, సంపద ఇవ్వాలని కోరుకుంటున్నా’’ - జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌

‘‘హ్యాపీ బర్త్‌డే కేటీఆర్‌. నిస్వార్థంతో మీరు చేస్తున్న ఈ సేవ మరింత కొనసాగాలని, మరీ ముఖ్యంగా ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఎక్కువ మందికి చేరాలని కోరుకుంటున్నా’’ -రామ్‌చరణ్‌

‘‘హ్యాపీ బర్త్‌డే కేటీఆర్‌. ఇలాగే అందరికీ మీరొక ఉదాహరణగా, ఆదర్శంగా నిలవాలి. ఆ భగవంతుడు ఎల్లప్పుడూ మీకు సంతోషం, మనశ్శాంతి ఇవ్వాలని ఆశిస్తున్నా’’-మహేశ్‌బాబు

‘‘హ్యాపీబర్త్‌డే కేటీఆర్‌ గారు. ఈ ఏడాదంతా మీకు సుఖ, సంతోషాలతో గడవాలని, సంపూర్ణ ఆరోగ్యం కలగాలని కోరుకుంటున్నా’’- సినీ నటుడు వెంకటేశ్‌

‘‘హ్యాపీ బర్త్‌డే కేటీఆర్‌. ఈ ఏడాది మీకు మరింత బాగుండాలి’’- నిర్మాత శోభూ యార్లగడ్డ

‘‘జన్మదిన శుభాకాంక్షలు కేటీఆర్‌ సర్‌’’-  దర్శకుడు సుధీర్‌ వర్మAdvertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని