ఓటీటీలో మెప్పిస్తోన్న ‘చావు కబురు చల్లగా’ - ckc movie getting huge response on ott
close
Published : 26/04/2021 17:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఓటీటీలో మెప్పిస్తోన్న ‘చావు కబురు చల్లగా’

ఇంటర్నెట్‌ డెస్క్‌: కార్తికేయ, లావణ్య త్రిపాఠి నాయకానాయికలుగా తెరకెక్కిన చిత్రం ‘చావు కబురు చల్లగా’. మార్చి 19న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎంటర్‌టైనర్‌గా మెప్పించినా, అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. కాగా, డిజిటల్‌ మాధ్యమంలో మాత్రం విశేషంగా మెప్పిస్తోంది. ప్రముఖ ఓటీటీ ‘ఆహా’ వేదికగా ఏప్రిల్‌ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరినీ ఆకట్టుకుంటోంది. విడుదలైన 72 గంటల్లో 100 మిలియన్‌ వ్యూయింగ్‌ మినిట్స్‌ సొంతం చేసుకుందని ‘ఆహా’ తెలిపింది. ఈ చిత్రానికి కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్‌ 2 పతాకంపై బన్నివాసు నిర్మించారు. జేక్స్‌ బెజోయ్‌ సంగీతం అందించారు. ఓటీటీ కోసం ఈ చిత్రాన్ని రీ ఎడిట్‌ చేసి, నిడివి తగ్గించిన విషయం తెలిసిందే.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని