రష్యాకు బయలుదేరిన 'కోబ్రా'! - cobra leaves for russia!
close
Published : 24/02/2021 22:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

 రష్యాకు బయలుదేరిన 'కోబ్రా'!

ఇంటర్నెట్‌ డెస్క్: విభిన్నమైన పాత్రలతో వైవిధ్య కథాంశాలతో తెరకెక్కిన చిత్రాల్లో నటించి ప్రేక్షకాభిమానాన్ని సంపాదించిన నటుడు విక్రమ్‌. ప్రస్తుతం మరోసారి వినూత్న కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'కోబ్రా'. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ని దాదాపు 11 నెలల తర్వాత మిగిలిన షెడ్యూల్ పూర్తి చేయడానికి చిత్రబృందం రష్యాలోని మాస్కోకు వెళ్లింది. గత ఏడాది మార్చిలో కరోనా మహమ్మారితో ఈ చిత్ర నిర్మాణం మధ్యలో ఆగిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుందని చిత్ర వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈ వేసవిలో సినిమా విడుదల చేయాలని నిర్మాణ సంస్థ లక్ష్యంగా పెట్టుకుందట. జనవరిలో విడుదలైన 'కోబ్రా' టీజర్‌ ఆకట్టుకుంది. టీజర్లో విక్రమ్‌ గణిత శాస్త్రవేత్తగా నటించాడు. అతను ఏ సమస్యనైనా క్షణంలో పరిష్కరించగలడు. ఈ చిత్రంలో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా నటించారు. చియాన్‌ విక్రమ్‌ ఇందులో ఇరవై వేర్వేరు పాత్రల్లో కనిపించనున్నారు. ఇందులో కె.ఎస్.రవికుమార్, శ్రీనిధి శెట్టి, మృణాలిని, కనికా, పద్మప్రియ, బాబు ఆంటోనీ తదితరులు నటిస్తున్నారు.  ఏఆర్‌ రెహమాన్‌ స్వరాలు అందిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. రష్యాకు బయలుదేరేముందు విక్రమ్‌, మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పొన్నియన్‌ సెల్వన్‌’ చిత్ర షూటింగ్‌లో ఉన్నారు.  


ఇవీ చదవండి:మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని