‘రెడ్‌’ ఐటమ్‌ సాంగ్‌ వీడియో వచ్చేసింది - dinchak full video song red ram pothineni and hebah patel
close
Published : 01/02/2021 01:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘రెడ్‌’ ఐటమ్‌ సాంగ్‌ వీడియో వచ్చేసింది

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇస్మార్ట్‌ హీరో రామ్‌ పోతినేనితో కలిసి కిషోర్‌ తిరుమల తెరకెక్కించిన చిత్రం ‘రెడ్‌’. ఈ సినిమా విడుదలై ప్రేక్షకులను థియేటర్లలో అలరిస్తోంది. రామ్‌ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో హెబ్బాపటేల్‌ ఐటమ్‌ సాంగ్‌లో అదరగొట్టింది. గతంలో డించక్‌.. డించక్‌ అంటూ సాగే లిరికల్‌ వీడియో విడుదలై యూట్యూబ్‌లో కుర్రకారును ఊర్రూతలూగించింది. తాజాగా.. ఆ పాటకు సంబంధించిన పూర్తి వీడియోను చిత్రబృందం యూట్యూబ్‌లో విడుదల చేసింది. ఈ పాటలో ఎనర్జిటిక్‌స్టార్‌ రామ్‌తో కలిసి హెబ్బా స్టెప్పులేసింది.

కిషోర్‌ తిరుమల, రామ్‌ పోతినేని కాంబినేషన్‌లో వచ్చిన ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమాలు మంచి విజయాలు సాధించాయి. తాజాగా ‘రెడ్‌’ కూడా ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. దీంతో వీళ్ల ఖాతాలో హ్యాట్రిక్‌ విజయం నమోదైంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. రామ్‌కు జోడీగా నివేదా పేతురాజ్‌, మాళవిక శర్మ, అమృతా అయ్యర్‌ ముగ్గురు భామలు సందడి చేశారు. స్రవంతి రవికిషోర్‌ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు.

ఇదీ చదవండి..

#BB3 రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌..!Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని