ఈ హీరోలు ఇలా చెబితే డేట్స్‌ ఇస్తారట! - director puri jagannath about pawan kalyan and other tollwyood stars
close
Published : 01/05/2021 15:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ హీరోలు ఇలా చెబితే డేట్స్‌ ఇస్తారట!

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుతం ఇండస్ట్రీలోని కథానాయకులందరూ వరుస చిత్రాలతో ఎప్పుడూ లేనంత బిజీగా ఉన్నారు. కరోనా కారణంగా సినిమాల చిత్రీకరణ, విడుదల వాయిదా పడింది కానీ, పరిస్థితులు బాగుండి ఉంటే ఇప్పటికే పలు చిత్రాలు ప్రేక్షకులను అలరించేవి. అయితే, ఒకప్పుడు అగ్ర కథానాయకుడి సినిమా అంటే కనీసం రెండేళ్లు వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేది. అదే సమయంలో సినిమాపై ఒక్కో హీరోకు ఒక్కో భిన్నమైన ఆలోచన ఉంటుంది. హిట్‌ ఫార్ములాతో పాటు, తమ అభిరుచి మేరకు సినిమాల చేస్తుంటారు కథానాయికలు. అసలు ఎవరికి ఏం చెబితే కాల్షీట్స్‌ ఇస్తారో స్టార్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్ ఓ సందర్భంలో ఇలా చెప్పారు.

‘‘ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఓ జోక్‌ ఉంది. అది ఏంటంటే.. ఏ హీరోకి ఏ కబుర్లు చెబితే త్వరగా డేట్లు ఇచ్చేస్తారో ఇప్పుడు చెబుతా.. ‘ఈ సినిమాలో అన్నీ గన్సే విలన్‌ పెద్ద గన్‌ డీలర్‌.. ఇష్టమొచ్చినట్టు కాల్చేసుకోవచ్చు’ అని చెబితే పవన్‌కల్యాణ్‌ డేట్‌ ఇస్తారట.. ‘అసలు అవుట్‌ డోర్‌ అంటూ ఏమీ లేదండీ మొత్తం అంతా ఇండోర్‌ సెట్స్‌లోనే తీస్తున్నాం’ అని చెబితే ప్రభాస్‌ డేట్స్‌ ఇస్తారట.. ‘ఈ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులు కొట్టేద్దాం’ అని అంటే ‘కుమ్మేద్దాం భయ్యా’ అంటూ ఎన్టీఆర్‌ కాల్షీట్‌ ఇచ్చేస్తారట.. ‘ఇవాళ షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తే 30 రోజుల్లో సినిమా అయిపోతుంది’ అని చెబితే రవితేజ డేట్స్‌ ఇస్తారట.. ‘రేపు సినిమా స్టార్ట్‌ అవుతుంది సర్‌. ఎప్పుడు ఫినిష్‌ అవుతుందో తెలియదు’ అని చెబితే మహేశ్‌ బాబు డేట్స్‌ ఇస్తారట. ఇది ఇండస్ట్రీలో టాక్‌. ఇది కేవలం ఒక జోక్‌ మాత్రమే’ అని పూరి ఓ ఫంక్షన్‌లో చెప్పారు. అక్కడే వేదిక దగ్గర ఉన్న మహేశ్‌బాబు, నమ్రత పూరి మాటలకు నవ్వుతూనే ఉన్నారు. ముఖ్యంగా మహేశ్‌ అయితే, కడుపుబ్బా నవ్వారు. పూరి చెప్పిన హీరోలందరూ ప్రస్తుతం విభిన్న సినిమాలతో, పాత్రలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని