ఈ మిస్‌ ఇండియా పోటీదారు.. నేడు కేంద్ర మంత్రి!
close
Published : 27/06/2020 15:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ మిస్‌ ఇండియా పోటీదారు.. నేడు కేంద్ర మంత్రి!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆధునిక దుస్తుల్లో చిరునవ్వులొలికిస్తున్న ఈ యువతి చిత్రాన్ని చూశారా... ఇది 1998 నాటి మిస్‌ ఇండియా పోటీల్లో పాల్గొన్న ఓ పోటీదారుకి చెందినది. కాగా దీనికి సంబంధించిన వీడియోను ఆమె స్నేహితురాలు, ప్రముఖ బుల్లితెర నిర్మాత ఏక్తాకపూర్‌ సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు. ఇక ఈమె ఎవరు అనే విషయానికొస్తే... ఆ చిత్రాల్లో ఉన్నది నేటి కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి స్మృతి ఇరానీ!

రాజకీయాల్లోకి రాక ముందు స్మృతి ‘క్యూంకి.. సాస్‌ భీ కభీ బహూ థీ...’ వంటి అమిత ప్రజాదరణ పొందిన టీవీ సీరియళ్లలో నటించారనేది చాలా మందికి తెలిసిందే. అప్పటినుంచి వారిద్దరూ మంచి స్నేహితులయ్యారు. అయితే... ఇరానీ తన 21ఏళ్ల వయసులో మిస్‌ ఇండియా పోటీలో పాల్గొన్నారనే విషయం ఈ వీడియో ద్వారా చర్చనీయాంశమైంది. ఈ పోటీలో 11వ నంబరు పోటీదారుగా స్మృతి ర్యాంప్‌ వాక్‌ చేసిన వీడియో, ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వివరీతంగా వైరల్‌ అవుతోంది.

‘‘విజయం సులువుగా వస్తుందని అనుకుంటారు.. కానీ అది చాలా కష్ట సాధ్యమైనది, కఠినమైనది.. కానీ నిరంతర కృషితో తప్పక వరిస్తుంది.’’ అని ఏక్తా ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అందుకు స్మృతినే ఉదాహరణగా పేర్కొన్నారు. తొలుత మృదువుగా, బెరుగ్గా, అతి సామాన్యంగా ఉండే తన స్నేహితురాలు... ఇప్పుడు రాజకీయాల్లో శక్తివంతమైన, నిజాయితీపరురాలైన రాజకీయవేత్తగా ఎదిగిందని  ప్రశంసించారు. ఆమె వ్యక్తిత్వం సమయం గడుస్తున్న కొద్దీ అనేక ఉత్తమ మార్పులను సంతరించుకుందని  అన్నారు. 44 ఏళ్ల స్మృతి ఇరానీ..  వ్యాపార వేత్త జుబిన్‌ ఇరానీని వివాహం చేసుకున్నారు. రాజకీయాల్లో కాలిడిన తరువాత నటనకు స్వస్తి చెప్పారు. కాగా, ఇరానీ ప్రస్థానం చాలా స్ఫూర్తినిచ్చేదిగా ఉందంటూ హృతిక్‌ రోషన్‌ సతీమణి సుజన్నెతో పాటు పలువురు నెటిజన్లు ఫిదా అయ్యారు.

 

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని