వావ్‌.. ధ‌నుష్ వ‌ర్కౌట్‌.. వీడియో వైర‌ల్‌‌
close
Published : 22/06/2020 14:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వావ్‌.. ధ‌నుష్ వ‌ర్కౌట్‌.. వీడియో వైర‌ల్‌‌

చెన్నై: ‌కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ అభిమానుల్ని సంపాదించుకున్న‌ క‌థానాయ‌కుడు ధ‌నుష్‌. కేవ‌లం ద‌‌క్షిణాదిలోనే కాకుండా ఉత్త‌రాది ప్రేక్ష‌కుల్ని కూడా త‌న న‌ట‌న‌తో అల‌రిస్తున్నారు. ఆయ‌న ‘మారి 2’ సినిమా కోసం గ‌తంలో చేసిన‌ క‌స‌ర‌త్తుల‌ వీడియో ఇప్పుడు  బ‌య‌టికి వ‌చ్చింది.

సాయిప‌ల్ల‌వి, వ‌ర‌లక్ష్మి, తోవినో థామ‌స్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన చిత్రమిది. బాలాజీ మోహ‌న్ ద‌ర్శ‌కుడు. ఈ సినిమా క్లైమాక్స్‌లో ధ‌నుష్ చొక్కా లేకుండా థామ‌స్‌తో పోరాడ‌తారు. ఆ స‌న్నివేశంలో  ధ‌నుష్ సిక్స్‌ప్యాక్‌లో క‌నిపించి‌, అభిమానుల్ని ఆక‌ట్టుకున్నారు. కాగా ఆ పాత్ర కోసం ఆయ‌న ఎంత క‌ష్ట‌ప‌డ్డారో తెలుపుతూ.. అభిమానులు తాజాగా 30 సెక‌న్ల‌ వీడియోను సోష‌ల్‌మీడియాలో షేర్ చేశారు. ధ‌నుష్ వ‌ర్కౌట్స్‌కు సంబంధించిన అరుదైన వీడియో కావ‌డంతో అది వైర‌ల్‌గా మారింది. హీరో అంకిత‌భావాన్ని నెటిజ‌న్లు ప్ర‌శంసిస్తున్నారు.

ధ‌నుష్ గ‌త ఏడాది ‘అసుర‌న్’, ‘తూటా’ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. 2020 ఆరంభంలో ‘ప‌టాస్’ సినిమాతో త‌మిళంలో హిట్ అందుకున్నారు. ఇప్పుడు ఆయ‌న చేతుల్లో ‘జ‌గ‌మే తందిరం’, ‘క‌ర్ణ‌ణ్’ అనే త‌మిళ సినిమాల‌తోపాటు హిందీ ప్రాజెక్టు ‘అత‌రంగిరే’ ఉన్నాయి.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని