ఇప్పుడు విద్యుల్లేఖను చూస్తే షాక్‌ అవుతారు
close
Updated : 14/03/2021 16:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇప్పుడు విద్యుల్లేఖను చూస్తే షాక్‌ అవుతారు

సోషల్‌ మీడియాలో భావోద్వేగపు పోస్ట్‌ చేసిన నటి

హైదరాబాద్‌: సహ నటి విద్యుల్లేఖ రామన్‌ తాజా ఫొటో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆమె ‘రన్‌ రాజా రన్‌’, ‘రాజుగారి గది’, ‘సరైనోడు’, ‘ధృవ’, ‘దువ్వాడ జగన్నాథమ్‌’, ‘నిన్నుకోరి’, ‘ఆనందో బ్రహ్మ’, ‘భాగమతి’.. ఇలా అనేక చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. ఈ క్రమంలో తన బరువు విషయంలో విమర్శలు వచ్చాయని, అవెంతో బాధించాయని గతంలో ఆమె ఆవేదన చెందారు. కాగా లాక్‌డౌన్‌లో అంకితభావంతో కసరత్తులు చేసి బరువు తగ్గారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఆమె శరీరంలో మార్పు చూసి అందరూ షాక్‌ అయ్యారు. ఈ ఫొటో వైరల్‌ అయ్యింది.

‘‘ఫేక్‌ నమ్మకానికి.. నిజమైన నమ్మకానికి చాలా తేడా ఉంది. నేను అధిక బరువు ఉన్నప్పుడు ‘నువ్వు ఎలా ఇంత ఆత్మస్థైర్యంతో ఉండగలుగుతున్నావు?’ అని నన్ను చాలా మంది అడిగారు. కానీ ఇప్పుడు నిజంగా నాలో విశ్వాసం పెరిగింది. ఎందుకంటే.. నేను సాధించలేను అనుకున్నది.. సాధించా. నా లైఫ్‌స్టైల్‌ను, అలవాట్లను మార్చుకున్నా. మనసుపెడితే ఏదైనా సాధ్యమేనని అర్థం చేసుకున్నా.. ఇది నిజం.’’

‘‘జీవితంలో క్రమశిక్షణ ఎంతో అవసరం. వారంలో ఆరు రోజులు వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. సరైన ఆహారం తీసుకోవాలి. బరువు తగ్గడానికి ఎటువంటి రహస్యాలు, మందులు అవసరం లేదు. కేవలం స్వచ్ఛమైన శ్రమ చాలు.. మన కన్నీరు, కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. 2020 జూన్‌ 20 నాటికి నా బరువు 68.2 కిలోలు..’’ అని విద్యుల్లేఖ భావోద్వేగంతో వివరించారు.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని