రజనీకాంత్‌కు  దాదాసాహెబ్‌ ఫాల్కే
close
Updated : 01/04/2021 11:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రజనీకాంత్‌కు  దాదాసాహెబ్‌ ఫాల్కే

దిల్లీ: అగ్రకథానాయకుడు, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు విశిష్ట గౌరవం దక్కింది. కేంద్రం గురువారం ఉదయం ఆయనకు దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించింది. 51వ దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు ఆయనకు ఇస్తున్నట్లు తాజాగా కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ ప్రకటించారు. భారతీయ చలన చిత్ర పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే పేరుతో సినీ రంగంలో విశేష సేవలు అందించిన వారికి 1969 నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారం ప్రకటిస్తోంది. 

ఇటీవల కాలంలో బాలీవుడ్‌ అగ్రనటుడు అమితాబ్‌ బచ్చన్‌ను ఈ పురస్కారం వరించిన విషయం తెలిసిందే. అలాగే దక్షిణాదికి చెందిన బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి (తెలుగు), ఎల్వీ ప్రసాద్‌ (తెలుగు), నాగిరెడ్డి(తెలుగు), అక్కినేని నాగేశ్వరరావు(తెలుగు), శివాజీ గణేషన్‌(తమిళం), రాజ్‌కుమార్‌(కన్నడ), గోపాలకృష్ణన్‌(మలయాళం), రామానాయుడు(తెలుగు), బాలచందర్‌(తెలుగు, తమిళం), కె. విశ్వనాథ్‌(తెలుగు) ఈ పురస్కారాన్ని అందుకున్నవారిలో ఉన్నారు.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని