DaareLeda: మబ్బే కమ్మిందా.. లోకం ఆగిందా! - Daare Leda Music Video
close
Updated : 19/06/2021 14:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

DaareLeda: మబ్బే కమ్మిందా.. లోకం ఆగిందా!

కథానాయకులు నాని, సత్యదేవ్‌ ‘దారే లేదా’ మ్యూజిక్‌ వీడియో కోసం చేతులు కలిపారు. కరోనా బాధితుల ప్రాణాల్ని రక్షించడం కోసం ఎన్నెన్ని త్యాగాలు చేయాల్సి వచ్చిందో గుర్తు చేస్తూ... తొలి వరసలో ఉంటూ సాహసోపేతంగా సేవలు అందించిన వైద్యులు, ఇతర సిబ్బందికి అంకితం ఇస్తూ రూపొందిన ఈ వీడియో శుక్రవారం విడుదలైంది. కథానాయకుడు నాని ఈ వీడియోని సమర్పించగా... సత్యదేవ్‌, రూప వైద్యులుగా నటించారు. ఛాయ్‌ బిస్కెట్‌ ఈ పాట ఎగ్జిక్యూషన్‌ బాధ్యతల్ని నిర్వర్తించింది. ‘మబ్బే కమ్మిందా... లోకం ఆగిందా! మాతో కాదంటూ... చూస్తూ ఉండాలా... దారే లేదా...! గాలే భయమైందా? శ్వాసే కరువైందా? యుద్ధం చేస్తున్న శత్రువు దూరంగా పోనే పోదా...’ అంటూ సాగే ఈ వీడియోకి గీత రచయిత కె.కె సాహిత్యం అందించారు. విజయ్‌ బులగానిన్‌ స్వరాలు సమకూర్చారు. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ పాట సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.



Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని