ఆది.. కొత్త కబురు
close
Published : 19/06/2021 00:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆది.. కొత్త కబురు

ఆది సాయికుమార్‌ కథానాయకుడిగా కల్యాణ్‌ జీ గోగణ దర్శకత్వంలో ఓ సినిమా పట్టాలెక్కుతోంది. నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు. నటుడు సునీల్‌ ఓ కీలక పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు శుక్రవారం చిత్ర నిర్మాత ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ‘‘ఆదితో సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయన్ని ఈ చిత్రంలో కొత్త కోణంలో చూపించనున్నాం. ఓ విభిన్నమైన కథాంశంతో దర్శకుడు కల్యాణ్‌ ఈ సినిమా తెరకెక్కించనున్నారు. సునీల్‌ ఒక ముఖ్య పాత్రలో కనిపిస్తారు. అదేంటన్నది తెరపైనే చూడాలి. త్వరలో చిత్రీకరణ ప్రారంభిస్తాం. ఈలోపు ఇతర నటీనటుల వివరాల్ని తెలియజేస్తాం’’ అన్నారు. దీనికి సంగీతం: సాయికార్తీక్‌, కూర్పు: మణికాంత్‌, ఛాయాగ్రహణం: బాల్‌ రెడ్డి. ఎగ్జికూటివ్‌ నిర్మాత: తిర్మల్‌రెడ్డి యాళ్ల.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని