Raja Raja Chora: చోరుడి శపథం - Raja Raja Chora teaser
close
Updated : 19/06/2021 14:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Raja Raja Chora: చోరుడి శపథం

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా చెప్పుకొనే ఓ దొంగ కథేమిటో తెలియాలంటే ‘రాజ రాజ చోర’ చూడాల్సిందే. శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన చిత్రమిది. మేఘ ఆకాష్‌ కథానాయిక. సునయన, రవిబాబు ముఖ్య పాత్రలు పోషించారు. హసిత్‌ గోలి దర్శకుడు. టి.జి.విశ్వ ప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మాతలు. ఈ సినిమా టీజర్‌ని శుక్రవారం విడుదల చేశారు. చోర కళలో ఆరితేరిన కుర్రాడిగా కిరీటం ధరించి శ్రీవిష్ణు చేసిన సందడి అలరిస్తోంది. ‘ఈ పాత్రతో మీ ముందుకు రావడం నా అదృష్టం. ఈ కిరీటం ధరించినందుకు మీ పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తానన్నది నా శపథం’ అంటూ ట్వీట్‌ చేశారు శ్రీవిష్ణు. రవిబాబు పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపిస్తారు. తనికెళ్ల భరణి, గంగవ్వ, అజయ్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: వివేక్‌ సాగర్‌.



Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని