ధనుష్‌తో త్రిభాషా చిత్రం
close
Published : 19/06/2021 00:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ధనుష్‌తో త్రిభాషా చిత్రం

కొత్తదనం నిండిన ప్రేమకథలకు పెట్టింది పేరు దర్శకుడు శేఖర్‌ కమ్ముల. విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించే కథానాయకుడు ధనుష్‌. ఇప్పుడీ ఇద్దరి క్రేజీ కలయికలో ఓ చిత్రం తెరకెక్కనుంది. నారాయణ దాస్‌ నారంగ్‌, పి.రామ్మోహన్‌రావు సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం శుక్రవారం సామాజిక మాధ్యమాల ద్వారా అధికారికంగా ప్రకటించింది. ‘‘ధనుష్‌ తెలుగులో నేరుగా చేస్తున్న తొలి సినిమా ఇది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతుంది. దీని నిర్మాణంలో శేఖర్‌ కమ్ముల, ధనుష్‌లూ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారు. త్వరలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటిస్తాం’’ అని చిత్ర నిర్మాతలు తెలియజేశారు. శేఖర్‌ కమ్ముల ప్రస్తుతం ఇదే నిర్మాణ సంస్థలో ‘లవ్‌స్టోరీ’ చిత్రం తెరకెక్కించిన సంగతి తెలిసిందే. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ఈ సినిమా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని