Vijay devarakonda: ‘లైగర్‌’ ఆట.. షణ్ముఖ పాట
close
Updated : 07/09/2021 06:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Vijay devarakonda: ‘లైగర్‌’ ఆట.. షణ్ముఖ పాట

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ రూపొందిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘Liger’. ధర్మ ప్రొడక్షన్స్‌, పూరి కనెక్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనన్యా పాండే కథానాయిక. ఈ సినిమాలో ఇండియన్‌ ఐడల్‌ ఫేమ్‌ షణ్ముఖ ప్రియతో ఓ పాట పాడించారు విజయ్‌. ఆయన ఇటీవల  ఇండియన్‌ ఐడల్‌ ఫైనల్‌ కార్యక్రమం సందర్భంగా షణ్ముఖకి శుభాకాంక్షలు చెబుతూ.. తన తదుపరి చిత్రంలో పాడే అవకాశమిస్తానని హామీ ఇచ్చారు. అన్నట్లుగానే ఇప్పుడాయన ‘లైగర్‌’లో ఆమెతో ఓ పాట పాడించి తన హామీ నెరవేర్చుకున్నారు. అంతేకాకుండా షణ్ముకను, ఆమె తల్లిని తన నివాసంలో కలిసి సత్కరించారు. కరోనా పరిస్థితులతో చిత్రీకరణ దశలో ఆగిన ఈ సినిమా త్వరలో గోవాలో పునఃప్రారంభం కానుంది. విజయ్‌ మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ ఫైటర్‌గా కనిపించనున్నారు. కూర్పు: జునైద్‌ సిద్ధిఖీ, ఛాయాగ్రహణం: విష్ణు శర్మ.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని