వావ్‌.. విక్రమ్‌ లుక్‌ అదిరిపోయింది!
close
Published : 28/02/2020 18:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వావ్‌.. విక్రమ్‌ లుక్‌ అదిరిపోయింది!

హైదరాబాద్‌: సినిమా కోసం, అందులోని పాత్ర కోసం ఏమైనా చేసేందుకు, ఎంతలా అయినా మారేందుకు సిద్ధంగా ఉంటారు కొందరు నటులు. ఒక కమల్‌హాసన్‌, అమితాబ్‌బచ్చన్‌, మోహన్‌లాల్‌ ఇలా చెప్పుకొంటూ పోతే, ఆ జాబితాలో ప్రత్యేకంగా కనిపించే నటుడు విక్రమ్‌. వైవిధ్యమైన పాత్రల్లో విభిన్న గెటప్‌ల్లో కనిపించడం ఆయనకే సొంతం. జయాపజయాలతో సంబంధం లేకుండా కష్టపడతారు. విక్రమ్‌ కథానాయకుడు అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కోబ్రా’. శుక్రవారం ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. 

ఇందులో ఏడు విభిన్న గెటప్‌లలో విక్రమ్‌ కనిపించి కను విందు చేశారు. వివిధ గెటప్‌లలో కనిపించడం విక్రమ్‌కు కొత్తేమీ కాదు. కానీ, గతంలో ఎన్నడూ కనిపించని గెటప్‌లలో ‘కోబ్రా’లో కనిపిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా వేసవి కానుకగా మేలో విడుదల కానుంది. ఏఆర్‌ రెహమాన్‌ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చడం విశేషం. ‘కోబ్రా’ఫస్ట్‌లుక్‌కు అటు కోలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌ ప్రేక్షకులకు ఫిదా అవుతున్నారు. సినిమా కోసం ఆయన పడే కష్టానికి హ్యాట్సాఫ్‌ చెబుతున్నారు. మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని