అయినా సరే... మరో కొత్త సినిమా!
close
Updated : 12/05/2020 22:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అయినా సరే... మరో కొత్త సినిమా!

‘వి’, టక్‌ జగదీష్‌, శ్యామ్‌ సింగరాయ్‌... యువ కథానాయకుడు నాని కొత్త సినిమాల జాబితా ఇది. అంతా అనుకున్నట్టు  జరిగుంటే ఈ ఏడాదిలోనే ఈ మూడు చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చేవి. కానీ కరోనాతో వచ్చిన విరామం అన్ని సినిమాలపైనా ప్రభావం చూపించింది. అయినా సరే... నాని ఈ ఏడాది మరో కొత్త సినిమా ముచ్చటని వినిపించబోతున్నారు. యువ దర్శకుడు వివేక్‌ ఆత్రేయ చెప్పిన కథ నానికి నచ్చింది.

ఈ ఏడాది చివరలో వీరి కలయికలో సినిమా ఆరంభం కాబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించబోతోంది. ‘మెంటల్‌ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’ చిత్రాలతో ఆకట్టుకున్న వివేక్‌ ఆత్రేయతో నాని సినిమా చేస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని