‘అన్నాత’గా వస్తున్న రజనీ..!
close
Published : 27/01/2020 20:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘అన్నాత’గా వస్తున్న రజనీ..!

చెన్నై: ‘దర్బార్‌’తో మరో బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నారు తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌. ఇదే ఊపులో తన తర్వాతి సినిమాకు ఓకే చెప్పేశారు. రజనీకాంత్‌కు 168వ చిత్రమైన ఈ సినిమాకు సూపర్‌ హిట్‌ సినిమా ‘విశ్వాసం’ డైరెక్టర్‌ శివ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేశ్‌ హీరోయిన్‌గా కనిపించనుంది. ప్రకాశ్‌రాజ్‌, ఖుష్భూ, మీనా ఇతర కీలక పాత్రల్లో నటించనున్నారు. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మాణ బాధ్యతలు వహిస్తోంది.

కాగా.. ఈ సినిమాకు టైటిల్‌గా ఎంపిక చేసినట్లు రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ‘అన్నాత’(పెద్దన్న) పేరు ప్రధానంగా వినిపిస్తోంది. చిత్రబృందం ఇంతవరకూ సినిమా టైటిల్‌కు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అదే పేరును పరిశీలిస్తున్నప్పటికీ ఇంకా ఖరారు చేయలేదని తెలుస్తోంది. సినిమా చిత్రీకరణ ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభించి మార్చి 15 వరకు పూర్తి చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి వసంత్‌ దినకరణ్‌ సంగీతం అందించనున్నారు. ఇప్పటికే దర్బార్‌లో ‘దమ్ము.. దూళి’ పాట పాడిన ఎస్‌పీ.బాలసుబ్రహ్మణ్యం ఈ సినిమాలోనూ గానం ఆలపించనున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని