వావ్‌ అదా.. నీ ఎనర్జీకి సాటి లేరు!
close
Published : 18/03/2020 21:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వావ్‌ అదా.. నీ ఎనర్జీకి సాటి లేరు!

ఒక్క నిమిషంలో 21 హ్యాండ్‌స్టాండ్స్‌

హైదరాబాద్‌: కథానాయిక అదా శర్మ ఫిట్‌నెస్‌కు ఎంత ప్రాముఖ్యం ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తరచూ జిమ్‌, డ్యాన్స్‌ వీడియోలను షేర్‌ చేస్తుంటారు. తాజాగా హ్యాండ్‌ స్టాండ్స్‌ చేస్తుండగా తీసిన వీడియోను అదా నెటిజన్లతో పంచుకున్నారు. ‘ఒక్క నిమిషంలో మీరెన్ని హ్యాండ్‌ స్టాండ్స్‌ చేయగలరు?. ట్రైనర్‌ సమక్షంలోనే ఈ వ్యాయామం చేయాలి. లేకపోతే ప్రయత్నించొద్దు’ అని గమనిక కూడా రాశారు. ఆమె కేవలం ఒక్క నిమిషంలో 21 హ్యాండ్‌స్టాండ్స్‌ చేశారు. దీన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ‘మీ ఎనర్జీకి సాటిలేరు, వావ్‌, సూపర్‌..’ అంటూ కామెంట్లు చేశారు.

కరోనా సమయంలో జిమ్‌లు అన్నీ మూతపడ్డాయని.. ఇంట్లో ఉంటూ నచ్చిన వ్యాయమం చేయొచ్చంటూ రెండు రోజుల క్రితం కసరత్తులు చేస్తున్న వీడియోను అదా పోస్ట్‌ చేశారు. దృఢంగా, నిర్భయంగా, జాగ్రత్తలు తీసుకుని జీవించాలని కోరారు. ‘హార్ట్‌ ఎటాక్‌’ సినిమాతో అదా తెలుగు వారికి పరిచయమయ్యారు. ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’, ‘సుబ్రమణ్యం ఫర్‌సేల్’, ‘క్షణం’, ‘కల్కి’ చిత్రాలతో అలరించారు. ఇటీవల ఆమె నటించిన బాలీవుడ్‌ సినిమాలు ‘బైపాస్‌ రోడ్‌’, ‘కమాండో 3’ ప్రేక్షకుల ముందుకొచ్చాయి.
Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని