ప్రభాస్‌ ఫ్రెండ్‌షిప్‌ కోసం సినిమాలు మానేస్తా!
close
Updated : 23/03/2020 16:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రభాస్‌ ఫ్రెండ్‌షిప్‌ కోసం సినిమాలు మానేస్తా!

హైదరాబాద్‌: అనుష్క-ప్రభాస్‌. వెండితెరపై వీరి కెమిస్ట్రీ అద్భుతం. అందుకే బయట కూడా వీరి గురించి గాసిప్పులు వస్తుంటాయి. అయితే, తమ మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమేనని ఇటు అనుష్క, అటు ప్రభాస్‌ ఎన్నోసార్లు చెప్పారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో కూడా ఈ వార్తలపై స్వీటీ స్పష్టత ఇచ్చారు. కాగా, తాజాగా ఓ గేమ్‌లో షోలో పాల్గొన్న అనుష్కను ‘ఈ రెండింటిలో ఏదో ఒక పని చేయడం మానేయమంటే ఏం మానేస్తారు. A.ప్రభాస్‌తో ఫ్రెండ్‌షిప్‌, B.సినిమాల్లో యాక్టింగ్‌’ అని ప్రశ్నించగా, మరో ఆలోచన లేకుండా సినిమాల్లో నటించడం మానేస్తానని స్వీటీ సమాధానం ఇచ్చారు. తన పనికోసం స్నేహాన్ని వదులుకోలేనని చెప్పారు. 

ఇక పూరి జగన్నాథ్‌, రాజమౌళిలలో మీ ఫేవరెట్‌ దర్శకుడు ఎవరు? ప్రశ్నించగా, స్వీటీ పూరీ జగన్నాథ్ పేరు చెప్పారు. ఆయన అవకాశం ఇవ్వకపోతే తాను రాజమౌళిని కలిసే అవకాశం ఉండేది కాదని చెప్పుకొచ్చారు. అలాగే ‘మీరు రాజమౌళి లేదా నాగార్జున ఎవరి ఫ్యామిలీతో టూర్‌కు వెళ్తారు’ అని ప్రశ్నించగా, రాజమౌళి కుటుంబంతో వెళ్తానని స్వీటీ సమాధానం ఇచ్చారు.

కన్నీటి పర్యంతమైన అనుష్క

తన కెరీర్‌ ప్రారంభమై 15ఏళ్లు అయిన సందర్భంగా ‘సూపర్‌’ మూవీ షూటింగ్‌లో జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నారు అనుష్క. ‘‘సూపర్‌’ నా తొలి చిత్రమైతే అందులోని ‘అక్కడబక్కడ భంభేబో’ నా తొలి పాట. ‘సూపర్‌’ నాకు చాలా స్పెషల్‌. ఈ పాటకు రిహార్సల్స్‌ చేస్తున్నప్పుడు  డ్యాన్స్‌ ఎలా చేయాలో తెలిసేది కాదు. ‘నేను చేయలేను’ అని ఏడ్చాను. ‘పర్వాలేదు పది రోజులైనా టైమ్‌ తీసుకుని రిహార్సల్స్‌ చేయండి. వచ్చినప్పుడే చేద్దాం’ అని ఆ యూనిట్‌ మొత్తం ఎంతో ప్రేమగా చూసుకునేది. ఇప్పుడు అలవాటైంది కానీ, అప్పటికి నేను గ్రేట్‌ డ్యాన్సర్‌ను కాదు. నాకు తొలి అవకాశం ఇచ్చిన నాగార్జునగారు, పూరి జగన్నాథ్‌గారి ధన్యవాదాలు. 15ఏళ్ల కెరీర్‌ పూర్తయింది. ఇలాంటి సమయంలో కోడి రామకృష్ణగారు లేకపోవడం బాధాకరం. ఆయన ఎక్కడ ఉన్నా మాతోనే ఉంటారు’’ అంటూ భావోద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యారు అనుష్క.

ఫలితాల కోసం క్లిక్‌ చేయండి
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని