ఇంట్లోని జిమ్‌లో నమ్రత కసరత్తులు
close
Published : 11/04/2020 21:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇంట్లోని జిమ్‌లో నమ్రత కసరత్తులు

ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేరింగ్‌

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు సతీమణి, నటి నమ్రత సోషల్‌మీడియాలో చాలా చురుకుగా ఉంటారు. తరచూ భర్త మహేశ్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌ను అభిమానులకు షేర్‌ చేస్తుంటారు. పిల్లలు గౌతమ్‌, సితారపై ప్రేమను తెలుపుతూ ఫొటోలను పోస్ట్‌ చేస్తుంటారు. అయితే జిమ్‌ వీడియోలను మాత్రం షేర్‌ చేయలేదు. ఈ లాక్‌డౌన్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోలను ఆమె పంచుకున్నారు. బోరింగ్‌ని ఇలా పోగొట్టుకుంటున్నట్లు చెప్పారు. ఇంట్లోని జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోను షేర్‌ చేశారు.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో అందరూ ఇంట్లోనే ఉండాలని ఇటీవల నమ్రత కోరారు. అంతేకాదు ఇంట్లోని పెంపుడు జంతువుల్ని వదిలేయొద్దని చెప్పారు. తన ఇంట్లో ఉన్న పెంపుడు కుక్కలు ఆడుకుంటుండగా తీసిన వీడియోను షేర్‌ చేస్తూ.. ‘స్వీయ నిర్బంధంలో ట్రీట్‌ టైమ్‌. నా బేబీస్‌ ఎంజాయ్‌ చేస్తున్నాయి. దయచేసి మీ పెంపుడు జంతువుల్ని ఈ క్లిష్ట పరిస్థితుల్లో వదిలేయొద్దు. వాటికి ఈ సమయంలోనే మీ ప్రేమ, ఆదరణ కావాలి’ అని పోస్ట్‌ చేశారు.
 


 




Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని