సమంత‌ బర్త్‌డే.. చైతన్య ఏం చేశారంటే?
close
Published : 28/04/2020 13:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సమంత‌ బర్త్‌డే.. చైతన్య ఏం చేశారంటే?

భార్యకి ప్రేమతో.. 

హైదరాబాద్‌: అక్కినేని కోడలు సమంత కోసం ఆమె భర్త నాగచైతన్య ప్రత్యేకంగా కేక్‌ తయారు చేశారు. మంగళవారం సామ్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా చైతన్య సోమవారం రాత్రి జన్మదిన వేడుకల్ని నిర్వహించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో స్వయంగా కేక్‌ తయారు చేసి, ఆమెతో కట్‌ చేయించి.. శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు, వీడియోలను సామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు. అందులోని ఓ ఫొటోలో సామ్‌ కేక్‌ ముందు కూర్చుని దేవుడిని పార్థిస్తూ కనిపించారు. చైతన్య కేక్‌ చేసిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ఇంటికే పరిమితమైన చై-సామ్‌ ఇష్టమైన పనులు చేస్తూ.. సినిమాలు చూస్తున్నారు. పెంపుడు శునకం హష్‌తో సమయం గడుపుతున్నారు. సామ్‌ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ‘జన్మదిన శుభాకాంక్షలు సమంత. నీకు ఈ ఏడాది గొప్పగా ఉండాలని కోరుకుంటున్నా’ అని వెంకటేష్‌ పోస్ట్‌ చేశారు. ‘నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి సమంతకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఇలానే షైన్‌ అవుతూ ఉండు’ అని రకుల్‌ పేర్కొన్నారు. రానా, హన్సిక, తమన్నా, రత్నవేలు, నీరజ కోన, నందిని రెడ్డి, నాగశౌర్య, వెన్నెల కిశోర్‌ తదితరులు సోషల్‌మీడియా వేదికగా విష్‌ చేశారు. అభిమానులు సామ్‌ను శుభాకాంక్షల వెల్లువలో ముంచెత్తారు. ప్రస్తుతం HappyBirthdaySamantha ట్యాగ్‌ ట్విటర్‌ ట్రెండింగ్‌లో టాప్‌లో ఉంది. సామ్‌ను ఉద్దేశిస్తూ 1,92,000 ట్వీట్లు చేశారు.
Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని