వీడియో కాల్‌ ద్వారా సమంత జిమ్‌ పాఠాలు
close
Published : 13/05/2020 22:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వీడియో కాల్‌ ద్వారా సమంత జిమ్‌ పాఠాలు

హైదరాబాద్‌: అగ్ర కథానాయిక సమంత ఇంట్లో ఉంటూనే తెగ కసరత్తులు చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో వీడియో కాల్‌ ద్వారా ట్రైనర్‌ సందీప్‌ రాజ్‌ సూచనలు తీసుకుని ఫిట్‌గా తయారౌతున్నారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో షేర్‌ చేశారు. లాక్‌డౌన్‌ సమయంలోనూ అలుపులేకుండా అంకితభావంతో కసరత్తులు చేస్తున్న ఆమెను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

అంతేకాదు హోమ్‌ క్వారంటైన్‌లో సామ్‌ ఆన్‌లైన్‌ క్లాస్‌లు కూడా తీసుకుంటున్నారు. మెరుగైన నటిగా అందరి ముందుకు రాబోతున్నట్లు తెలిపారు. మంగళవారం చైతన్యతో కలిసి కారులో బయటికి వెళ్లిన ఫొటోను సామ్‌ షేర్‌ చేశారు. ‘జాను’ సినిమాతో సమంత ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శర్వానంద్‌ కథానాయకుడిగా నటించారు. ఈ సినిమా మంచి టాక్‌ అందుకున్నప్పటికీ బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. సామ్ త్వరలో ‘ది ఫ్యామిలీ మెన్‌’ సీజన్‌ 2లో కనిపించనున్నారు. అదేవిధంగా తమిళంలో రెండు ప్రాజెక్టులకు సంతకం చేసినట్లు సమాచారం. 

 Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని