నేను ప్రేమలో విఫలమయ్యా: అనుపమ - i had a bad breakup says anupama parameswaran
close
Updated : 10/07/2021 11:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నేను ప్రేమలో విఫలమయ్యా: అనుపమ

రియల్‌ లైఫ్‌ బ్రేకప్‌ను బయటపెట్టిన నటి

హైదరాబాద్‌: నటి అనుపమ పరమేశ్వరన్‌ తన ప్రేమ గురించి బయటపెట్టారు. గతంలో ఓ వ్యక్తిని గాఢంగా ప్రేమించానని తెలిపారు. ‘అ ఆ’తో నాగవల్లిగా మెప్పించి తెలుగువారికి చేరువైన ఈ మలయాళీ కుట్టి వరుస ప్రేమకథలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. సోషల్‌మీడియాలో సూపర్‌ యాక్టివ్‌గా ఉండే ఈ భామ తాజాగా ఇన్‌స్టా వేదికగా అభిమానులతో ముచ్చటించారు.

‘‘ప్రస్తుతం తెలుగులో మూడు సినిమాలు చేస్తున్నాను. ‘18 పేజీలు’, ‘కార్తికేయ -2’, ‘రౌడీ బాయ్స్‌’ చిత్రీకరణ దశల్లో ఉన్నాయి. కోలీవుడ్‌లో తెరకెక్కుతున్న ‘తల్లిపోగాదే’లో నటిస్తున్నాను. ఇక, కన్నడ చిత్రపరిశ్రమను మిస్‌ అవుతున్నాను. మంచి ప్రాజెక్ట్‌లో అవకాశం వస్తే అక్కడ కూడా సినిమాలు చేస్తాను’’ అని తెలిపారు.

అనంతరం తన ప్రేమ గురించి స్పందిస్తూ.. ‘గతంలో నేను ప్రేమలో పడ్డాను. ఓ వ్యక్తిని ఎంతో ఇష్టపడ్డాను. కాకపోతే అది బ్రేకప్‌ అయిపోయింది’ అని అన్నారు. ఇక హీరో రామ్‌ పోతినేని తనకి మంచి స్నేహితుడని తెలిపారు. అలాగే తన ఇష్టాయిష్టాల గురించి చెబుతూ.. ‘అమ్మ చేతి వంట అంటే నాకెంతో ఇష్టం. పాటలు పాడటం కూడా ఇష్టమే. ఈ మధ్యకాలంలో పెయింటింగ్‌ నేర్చుకున్నాను. ఎప్పుడైనా ప్రశాంతత కావాలని భావించినప్పుడు వెంటనే పెయింటింగ్స్‌ వేస్తాను. దాంతో నా మనసు, హృదయం రెండూ సంతోషంగా మారుతాయి’  అని ఆమె వివరించారు.

అనుపమ ప్రేమలో ఉందంటూ ఎన్నో సందర్భాల్లో వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. ఆమె ఓ హీరోతో రిలేషన్‌లో ఉందంటూ అప్పట్లో అందరూ చెప్పుకున్నారు. అలాంటిదేమీ లేదని ఆమె ఎన్నో సందర్భాల్లో సమాధానమిచ్చారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని