Ilayaraja: వర్సిటీ గురించి అప్పట్లో కరుణానిధిని అడిగా.. ఇకపై ఎవరినీ అడగను - ilayaraja about music university
close
Updated : 23/07/2021 14:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Ilayaraja: వర్సిటీ గురించి అప్పట్లో కరుణానిధిని అడిగా.. ఇకపై ఎవరినీ అడగను

చెన్నై: సంగీత విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోరానని.. ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదని.. ఇకపై దాని గురించి ఎవరినీ అడిగే ఉద్దేశం లేదని ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా చెప్పారు. కొత్తగా నిర్మించిన తన స్టూడియోలో గురువారం ఆయన  విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఒకప్పటి సంగీత వాద్య పరికరాలు కొన్ని ఇప్పుడు మనుగడలో లేవు. వాటి గురించి, మన సంగీత ప్రత్యేకతను తెలియజేయడానికి సంగీత విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఒకప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కరుణానిధిని కోరాను. వెంటనే పరిశీలిస్తానని చెప్పిన ఆయన ఆ తర్వాత జీవో విడుదల చేశారు. కానీ ఇప్పటికీ అది ఆచరణలోకి రాలేదు. ఇకపై ఎవరినీ అడగాలని అనుకోవడం లేదు’ అని చెప్పారు. 1300 చిత్రాలకు సంగీతం సమకూర్చారు. మీ ప్రయోగ ప్రయాణం ఇంకా కొనసాగుతోందా? అని అడగ్గా.. ‘సాగుతోందిగా.. మరింత వేగంతో! కొత్తగా స్టూడియో ఆరంభించా. చాలా కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి’ అని చెప్పారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని