వాళ్లు నన్ను హేళన చేశారు: ఇలియానా - ileana reveals she was bodyshamed at 12
close
Published : 29/04/2021 14:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వాళ్లు నన్ను హేళన చేశారు: ఇలియానా

12 ఏళ్ల వయసు నుంచి భరిస్తున్నా

హైదరాబాద్‌: ‘దేవదాసు’తో కథానాయికగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన నటి ఇలియానా. జీరో సైజ్‌ బ్యూటీగా చెప్పుకునే ఈ గోవా సుందరి శరీరాకృతి విషయంలో ఎంతోమంది నుంచి విమర్శలు ఎదుర్కొన్నట్లు తెలిపారు. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె వ్యక్తిగత జీవితం గురించి కొన్ని షాకింగ్‌ విషయాలు బయటపెట్టారు.

‘ఆరోజులు నాకింకా గుర్తున్నాయి. అవి చాలా విచిత్రమైనది ఎందుకంటే కొంతమంది నా శరీరాకృతిని సైతం ఓ మచ్చలా చూశారు. 12 సంవత్సరాల వయసు నుంచే బ్యూటీ, ఫిట్‌నెస్‌, శరీరాకృతి విషయంలో పలువురు నుంచి విమర్శలు ఎదుర్కొన్నాను. ఆ విమర్శలు నా హృదయాన్ని ఎన్నో సందర్భాల్లో గాయపరిచేవి. శరీరంలోని కొన్ని భాగాల గురించి నా ఎదుటే కామెంట్లు చేసేవాళ్లు. నాకు ఏమీ తెలియనట్లు వాటి గురించి ఎక్కువగా ఆలోచించేదాన్ని కాదు. నా శరీరం గురించి వాళ్లకెందుకు అనుకుని ముందుకు అడుగులు వేశాను’

‘నువ్వు ఎంత ఆరోగ్యంగా ఉన్నాసరే ఎదుటివారి నుంచి పదే పదే విమర్శలు ఎదురైనప్పుడు తప్పకుండా వాటిని నమ్మాల్సి వస్తోంది. దాంతో మనలో లోనిపోని భయాలు పెరిగిపోతాయి. అలాగే నేను కూడా ఎదుటివారి నుంచి వచ్చిన కామెంట్స్‌ని ఒకానొక సమయంలో ఎక్కువగా తీసేసుకున్నాను. దానివల్ల ఏదో తెలియని బాధ. అలాంటి వాటిని అస్సలు పట్టించుకోకూడదని ఒకానొక సమయంలో నిర్ణయించుకున్నా. ఇప్పటికీ నాకు నేను ప్రతిసారీ ధైర్యం చెప్పుకుంటున్నా’ అని ఇలియానా వివరించారు.

‘పోకిరి’, ‘జల్సా’, ‘రాఖీ’, ‘మున్నా’, ‘కిక్’, ‘నేను నా రాక్షసి’, ‘జులాయి’, ‘శక్తి’ చిత్రాలతో తెలుగువారిని అలరించిన ఇలియానా బాలీవుడ్‌లో సైతం సినిమాలు చేశారు. ‘దేవుడు చేసిన మనషులు’తో పరాజయం అందుకున్న ఆమె ఆరేళ్ల పాటు తెలుగు చిత్రపరిశ్రమకు దూరంగా ఉన్నారు. ఇటీవల ఆమె తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చిన సినిమా ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’. రవితేజ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా 2018లో విడుదలై విజయాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఇలియానా చేతిలో ‘అన్‌ఫెయిర్‌ అండ్‌ లవ్లీ’ అనే ప్రాజెక్ట్‌ ఉంది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని