ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌గా ఇర్ఫాన్‌ పఠాన్‌ - irfan pathan shares about his character in vikram cobra
close
Updated : 09/01/2021 16:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌గా ఇర్ఫాన్‌ పఠాన్‌

విక్రమ్‌తో కలిసి ‘కోబ్రా’లో అలరించనున్న మాజీ క్రికెటర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: విక్రమ్‌ కథానాయకుడిగా ఆర్‌.అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘కోబ్రా’. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాలో మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. సంక్రాంతి పండగను పురస్కరించుకుని శనివారం విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌ అంచనాలను పెంచుతోంది. ఇందులో విక్రమ్‌ 20 విభిన్న గెటప్‌లలో కనిపించనున్నాడని కోలీవుడ్‌ టాక్‌. కాగా, ఇందులో ఇర్ఫాన్‌ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. తాజాగా ఆయన పాత్రకు సంబంధించిన వివరాలను కూడా పంచుకున్నారు. ‘కోబ్రా’లో ఇర్ఫాన్‌ ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. కోల్‌కతాలో షూటింగ్‌ సందర్భంగా తీసిన ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ ‘కోల్‌కతాలో ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌ ఏం చేస్తున్నారు?’ అని క్యాప్షన్‌ ఇచ్చారు.

ఇటీవల ‘కోబ్రా’పై ఇర్ఫాన్‌ మాట్లాడారు. ‘‘సినిమా పరిశ్రమలో పలు విజయాలను సొంతం చేసుకుని విక్రమ్‌ స్టార్‌ అయ్యారు. అయినా కూడా ఇప్పటికీ ఆయన చాలా సింపుల్‌గా ఉంటారు. అదే ఆయనలో నాకు నచ్చిన గుణం. సెట్స్‌లో ఆయన్ను కలిసిన  ప్రతిసారీ సమయం అలా గడిచిపోతుండేది’’ అని చెప్పుకొచ్చారు.

‘కోబ్రా’ అత్యధిక భాగం చిత్రీకరణ రష్యాలో జరిగింది. అయితే, కరోనా వైరస్‌ విజృంభణతో షూటింగ్‌ను తాత్కాలికంగా వాయిదా వేశారు. పరిస్థితులు చక్కబడిన వెంటనే విక్రమ్‌ మళ్లీ మేకప్‌ వేసుకోనున్నారు. ఇటీవల చిత్ర బృందం ఓ పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు.

ఇవీ చదవండి..

థియేటర్లోకి ‘టక్‌ జగదీష్‌’ఎప్పుడంటే?Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని