
తాజా వార్తలు
ఓటీటీలో నాగార్జున కొత్త సినిమా?!
ఇంటర్నెట్ డెస్క్: థియేటర్లు తెరవడానికి అంతా సిద్ధం... అయితే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా అనేది ఇంకా ప్రశ్నార్థకం. ఇదీ ప్రస్తుతం టాలీవుడ్ పరిస్థితి. అందుకేనేమో తెలుగు నిర్మాతలు కొంతమంది ఓటీటీవైపే చూస్తున్నారు. ఈ క్రమంలో ఓటీటీలో మరో భారీ చిత్రం విడుదలకు రంగం సిద్ధమవుతోందా? అవుననే అంటున్నాయి ఓటీటీ వర్గాలు. నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న ‘వైల్డ్‌డాగ్’ ఓటీటీ వేదికగా విడుదల చేస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
అహిసోర్ సాల్మన్ దర్శకత్వంలో నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘వైల్డ్‌డాగ్’. ఇందులో నాగార్జున నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో పని చేసే విజయ్‌వర్మ అనే ఏజెంట్‌గా కనిపించబోతున్నాడు. లాక్డౌన్ బ్రేక్ తర్వాత ఇటీవల చిత్రీకరణ తిరిగి ప్రారంభించారు. దీని కోసం నాగ్ బృందం మనాలీ కూడా వెళ్లింది.
‘వైల్డ్‌డాగ్’ ఓటీటీ రిలీజ్ కోసం నెట్‌ఫ్లిక్స్‌తో చిత్రబృందం చర్చలు జరుపుతోందని టాలీవుడ్ ముచ్చట. ఒకవేళ ఈ పుకార్లు నిజమైతే ‘వి’, ‘నిశ్శబ్దం’, ‘ఆకాశం నీ హద్దురా’..తదితర సినిమాల తర్వాత ఓటీటీలో విడుదలయ్యే పెద్ద సినిమా ‘వైల్డ్ డాగ్’ అవుతుంది. మరి ఈ పుకారు నిజమవుతుందా? లేక థియేటర్లో నాగ్ కొత్త సినిమా విడుదల చేస్తారా అనేది చూడాలి. దియా మీర్జా, సయామీ ఖేర్, అతుల్ కులకర్ణి తదితరులు నటిస్తున్న ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఇన్‌కాగ్నిటో నిజంగా పనిచేస్తుందా?
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
- తమన్నా చీట్: సాయేషా డ్యాన్స్: మంచు కుటుంబం
- ఫిట్‌గా ఉన్నా.. గుండెపోటు వస్తుందా?
- అరెరె షా.. రోహిత్‌కు కోపం తెప్పించేశావ్‌గా!
- ఒంటెను ఢీకొని బెంగళూరు ఫేమస్ బైకర్ మృతి
- సస్పెన్స్‌కు తెరదించిన శతాబ్ది రాయ్
- మెగా కాంపౌండ్‌లో మ్యూజికల్ నైట్
- యూట్యూబర్ తప్పుడు రివ్యూ.. మూతపడ్డ హోటల్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
