బ్లాక్‌బస్టర్‌ మూవీ రీమేక్‌లో నాగబాబు - is this nagababu will going play the villain in chatrapathi remake
close
Published : 24/03/2021 01:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బ్లాక్‌బస్టర్‌ మూవీ రీమేక్‌లో నాగబాబు

బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న నటుడు

హైదరాబాద్‌: నటుడు నాగబాబు బాలీవుడ్‌ ఎంట్రీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. టాలీవుడ్‌లో బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని అందుకున్న ‘ఛత్రపతి’ రీమేక్‌తో ఆయన బీటౌన్‌లోకి వెళ్లనున్నారని వార్తలు వస్తున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌ నటించిన సూపర్‌హిట్‌ చిత్రం ‘ఛత్రపతి’. ఈ చిత్రాన్ని హిందీలోకి రీమేక్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ కథానాయకుడిగా తెరకెక్కనున్న ఈ రీమేక్‌ను ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్‌ రూపొందించనున్నారు.

కాగా, తాజా సమాచారం ప్రకారం.. నాగబాబు ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఇప్పటికే నాగబాబుతో చిత్రబృందం చర్చలు జరిపినట్లు బీటౌన్‌లో టాక్‌ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే నాగబాబు సైతం తన పాత్ర కోసం సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే, సదరు వార్తలపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని