‘ఇస్మార్ట్ శంక‌ర్‌’కి 200 మిలియన్ల వీక్షణలు - ismart shankar create a record
close
Published : 31/05/2021 01:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఇస్మార్ట్ శంక‌ర్‌’కి 200 మిలియన్ల వీక్షణలు

ఇంట‌ర్నెట్ డెస్క్‌: రామ్ హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన చిత్రం ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’. 2019లో బాక్సాఫీసు వ‌ద్ద ఘ‌న విజ‌యం అందుకున్న ఈ చిత్రం తాజాగా స‌రికొత్త రికార్డు నెల‌కొల్పింది. విశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన తెలుగు చిత్రాలు హిందీలో డబ్ అయ్యే విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే యూ ట్యూబ్‌లో అప్‌లోడ్ అయిన ఇస్మార్ట్ శంక‌ర్.. అత్య‌ధిక వీక్ష‌ణ‌లు సొంతం చేసుకుని సంచ‌ల‌నం సృష్టించింది. 200 మిలియ‌న్ (20 కోట్లు) మందికి పైగా ఈ చిత్రాన్ని వీక్షించారు. త‌క్కువ స‌మ‌యంలోనే ఇంత‌మంది చూడ‌టం విశేషం. యాక్ష‌న్ నేప‌థ్యంలో రూపొందిన ఈ సినిమాలో రామ్ త‌న‌లోని మాస్ కోణాన్ని ఆవిష్క‌రించారు. టైటిల్ పాత్ర పోషించి మంచి క్రేజ్ సంపాదించారు. రామ్ స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేశ్ న‌టించారు. మ‌ణిశ‌ర్మ సంగీతం అందించారు. పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి నిర్మాత‌లు. 



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని