Jyothika: నటి జోత్యిక ఇన్‌స్టా ఎంట్రీ - jyothika insta entry
close
Published : 01/09/2021 01:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Jyothika: నటి జోత్యిక ఇన్‌స్టా ఎంట్రీ

చెన్నై: దక్షిణాది నటి జ్యోతికకి అభిమానుల్లో ప్రత్యేకమైన క్రేజ్‌ ఉంది. చిరంజీవితో ‘ఠాగూర్’, నాగార్జునతో ‘మాస్‌’, రజనీకాంత్‌తో ‘చంద్రముఖి’, కమల్‌హాసన్ తో ‘రాఘవన్’... ఇలా అగ్రహీరోలతో నటించి.. తన నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు. 2006లో నటుడు సూర్యతో వివాహం అనంతరం కొన్నేళ్లు సినిమాలకు దూరమైన ఆమె వ్యక్తిగత జీవితంలో బిజీగా ఉన్నారు. ఇటీవలే మళ్లీ సినిమాల్లో సెకెండ్‌ ఇన్నింగ్స్ సైతం ప్రారంభించినామె ఇన్నేళ్లూ సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటూ వచ్చారు. కాగా మంగళవారం (ఆగస్టు31న) జోత్యిక ‘ఇన్‌స్టాగ్రామ్‌’లో ఇంట్రీ ఇచ్చారు.

ఈ సందర్భంగా తన తొలిపోస్ట్‌లో జాతీయ జెండా ఎగురవేస్తూ.. ‘‘హలో అందరికీ! సోషల్‌మీడియాలో అడుగుపెట్టడం ఇదే మొదటిసారి. నా లాక్‌డౌన్‌ డైరీస్‌లో ఎన్నో పాజిటివ్‌ అంశాలున్నాయి. వాటిని మీతో షేర్ చేసుకుంటున్నా. భారతదేశం ఎంతో అందమైనది. స్వాతంత్ర్య దినోత్సవం నాడు నేను కశ్మీర్‌లోని సరస్సులు, హిమాలయాల్లో పర్యటించా. బీకాత్‌ ఆడ్వెంచర్స్‌ అనే బృందం.. సచిన్‌, రౌల్‌, అశ్విన్‌తోపాటు ముస్తాక్, రియాజ్‌తో 70కి.మీ ట్రెక్కింగ్‌ చేశా. మనం జీవించడం ప్రారంభించకపోతే జీవితం ఒక ఉనికి మాత్రమే! జైహింద్‌’’ అని రాశారు. ఇక ఆమె అకౌంట్‌ ఓపెన్‌ చేసిన నాలుగంటల్లోనే 14లక్షల మంది ఆమెను ఫాలో చేయడం విశేషం.ఆమె భర్త, నటుడు సూర్యకు ఇన్‌స్టాలో 32లక్షల మంది ఉన్నారు.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని