SulthanTrailer: ఆహా వేదికగా ‘సుల్తాన్‌’ - karthi sulthan trailer
close
Published : 28/04/2021 12:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

SulthanTrailer: ఆహా వేదికగా ‘సుల్తాన్‌’

ఇంటర్నెట్‌ డెస్క్‌: కార్తి కథానాయకుడిగా భాగ్యరాజ్‌ కణ్ణన్‌ తెరకెక్కించిన చిత్రం ‘సుల్తాన్‌’. రష్మిక కథానాయిక. ఇటీవల థియేటర్‌లో సందడి చేసిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ వేదికగా అలరించేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ ఓటీటీ ఆహాలో ఏప్రిల్‌ 30 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలోనే కొత్త ట్రైలర్‌ని విడుదల చేసింది ఆహా. యాక్షన్‌ సన్నివేశాలు, పవర్‌ఫుల్‌ డైలాగులు, కామెడీ, రష్మిక అందం.. ఇలా వినోదాల విందులా ట్రైలర్‌ సాగింది. యాక్షన్‌ ప్రధానంగా రూపొందిన ఈ సినిమాలో నెపోలియన్‌, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. డ్రీమ్‌ వారియర్స్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌.ఆర్‌. ప్రకాశ్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు నిర్మించారు. ఈ సినిమాకి సంగీతం: వివేక్‌ మర్విన్‌, నేపథ్య సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని