నిజమే.. కత్రినా-విక్కీ డేటింగ్‌లో ఉన్నారు - katrina kaif and vicky kaushal are dating harshvardhan kapoor reveals
close
Published : 10/06/2021 01:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిజమే.. కత్రినా-విక్కీ డేటింగ్‌లో ఉన్నారు

బాలీవుడ్‌ ప్రేమజంట గుట్టు విప్పిన నటుడు

ముంబయి: బాలీవుడ్‌ అందగత్తె కత్రినాకైఫ్‌, నటుడు విక్కీ కౌశల్‌ డేటింగ్‌లో ఉన్న మాట వాస్తవమేనని బాలీవుడ్‌ స్టార్‌ హీరో అనిల్‌కపూర్‌ కుమారుడు, నటుడు హర్షవర్ధన్‌ కపూర్‌ వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హర్షవర్ధన్‌ ఈ బాలీవుడ్‌ ప్రేమజంట గురించి వస్తోన్న వార్తలపై స్పందించారు. ‘మీరు నిజమేనని నమ్ముతున్న ఒక్క బాలీవుడ్‌ జంట లవ్‌ రూమర్స్‌పై స్పందించగలరు’ అని విలేకరి ప్రశ్నించగా.. ‘విక్కీ కౌశల్‌, కత్రినాకైఫ్‌ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. అది నిజం. ఒకవేళ ఈ విషయాన్ని బయటపెట్టడం వల్ల నాకేమైనా ఇబ్బందులు వస్తాయేమో? నాకు కూడా తెలియదు. అయినా తమ మధ్య ఉన్న బంధం గురించి ఇప్పటికే వాళ్లు ఎన్నో సందర్భాల్లో చెప్పకనే చెప్పేశారు’ అని తెలిపారు.

కత్రినాకైఫ్‌-విక్కీ కౌశల్‌ గత కొన్ని సంవత్సరాల నుంచి స్నేహితులుగా ఉన్నారు. బాలీవుడ్‌ ప్రముఖుల ఇళ్లల్లో జరిగే ఫంక్షన్లకు సైతం వీరిద్దరూ కలిసే వెళ్లి వస్తుంటారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ గడిచిన రెండేళ్ల నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై స్పందించమని ఇప్పటికే పలుమార్లు విక్కీ అడగ్గా .. వ్యక్తిగత జీవితం గురించి బయటపెట్టడం తనకు అంతగా ఇష్టం ఉండదని  మాట దాటవేశారు. ఇక, కత్రినాకైఫ్‌ వీళ్ల బంధంపై ఎప్పుడూ నోరు విప్పలేదు. మరోవైపు, తాజాగా విక్కీ కౌశల్‌.. కత్రినా ఇంటికి కూడా వెళ్లి వచ్చారు. ఆరు గంటలపాటు ఆమె కుటుంబంతోనే ఆయన సమయాన్ని గడిపారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని