రామ్‌ సరసన కృతి ఖరారైంది - krithi shetty opposite to ram
close
Published : 05/03/2021 21:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రామ్‌ సరసన కృతి ఖరారైంది

ఇంటర్నెట్ డెస్క్‌: రామ్‌ కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో నాయికగా ‘ఉప్పెన’ భామ కృతిశెట్టి నటిస్తుందంటూ ఇటీవలే ప్రచారం సాగింది. ఇదే విషయాన్ని తాజాగా వెల్లడించింది చిత్రబృందం. ‘రాపో 19’ వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందనున్న ఈ సినిమాలో కృతి శెట్టిని ఎంపిక చేసినట్టు సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేసింది. శ్రీనివాసా సిల్వర్‌ స్ర్కీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూర్తి స్థాయి యాక్షన్‌ నేపథ్యంలో సాగుతుందని సమాచారం. టైటిల్‌, సాంకేతిక బృంద వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న కృతి ప్రస్తుతం నాని సరసన ‘శ్యామ్‌ సింగరాయ్‌’, సుధీర్‌ బాబు సరసన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్రాల్లో నటిస్తోంది.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని