ఉత్కంఠగా ‘కుడి ఎడమైతే’ టీజర్‌ - kudi yedamaithe teaser out now
close
Published : 03/07/2021 14:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఉత్కంఠగా ‘కుడి ఎడమైతే’ టీజర్‌

హైదరాబాద్‌: ‘మీకు ఎప్పుడైనా జీవితంలో జరిగిందే మళ్లీ మళ్లీ జరిగినట్లు అనిపించిందా? దేవుడ్ని నమ్ముతావా.. అలాగే ఇది కూడా. అనుభవం అయితేనే మీరూ నమ్ముతారు’ అని అంటున్నారు నటి అమలా పాల్‌. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కుడి ఎడమైతే’. క్రైమ్‌, సస్పెన్స్‌ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి పవన్‌కుమార్‌ దర్శకత్వం వహించారు. తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ ‘ఆహా’ వేదికగా ఈ నెల 16న ‘కుడి ఎడమైతే’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో శనివారం టీజర్‌ను చిత్రబృందం నెటిజన్లతో పంచుకుంది. ఇందులో అమలాపాల్‌ పోలీస్‌ పాత్రలో కనిపించనున్నారు. నటుడు రాహుల్‌ విజయ్‌ కీలకపాత్ర పోషించారు. ‘యూ టర్న్‌’, ‘లూసియా’ వంటి సస్పెన్స్ థ్రిల్లర్లను ప్రేక్షకులకు అందించి ఇప్పటికే దర్శకుడిగా పవన్‌కుమార్‌ మంచి మార్కులు కొట్టేశారు.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని