Maha Ganesha: చిన్నారులను అలరించేలా ‘మహా గణేశా’ - maha ganesha trailer
close
Published : 08/09/2021 16:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Maha Ganesha: చిన్నారులను అలరించేలా ‘మహా గణేశా’

ఇంటర్నెట్‌డెస్క్‌: వినాయకచవితి సందర్భంగా అటు వెండితెరపైనా, ఇటు ఓటీటీలోనూ కొత్త సినిమాల సందడి షురూ కానుంది. అదే సమయంలో ఓ యానిమేషన్‌ మూవీ కూడా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఆహా’ రూపొందించిన ‘మహా గణేశా’ యానిమేషన్‌ మూవీ సెప్టెంబరు 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ‘‘ఈ వినాయకచవితికి మన ‘మహా గణేశా’ చూడండి. చిన్నప్పుడు చేసిన చిలిపి పనుల నుంచి చంద్రుడికి తను ఇచ్చిన శాపం వరకూ ఎన్నో వింతలు, విశేషాలు ఈ సిరీస్‌లో చూసి తెలుసుకునేందుకు సిద్ధంగా ఉండండి’’ అని ఆహా ట్వీట్‌ చేసింది. మరి ఈ ‘మహా గణేశా’ అల్లరిని చూడాలంటే సెప్టెంబరు 10 తేదీ వరకూ వేచి చూడాల్సిందే. అప్పటివరకూ ఈ ట్రైలర్‌ చూసేయండి.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని