నా శరీరం అందుకు సహకరించేది కాదు - malaika arora reveals she struggled to work out after covid-19: it broke me physically
close
Published : 31/05/2021 22:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నా శరీరం అందుకు సహకరించేది కాదు

బాలీవుడ్‌ నటి మలైకా అరోరా ఖాన్‌ 

పవన్‌కల్యాణ్‌ ‘గబ్బర్‌సింగ్‌’లో కెవ్వు కేక, షారుఖ్ ‘దిల్‌ సే’లో ఛయ్యా ఛయ్యా అంటే చాలు వెంటనే ఆమె గుర్తొస్తుంది. ఆమే బాలీవుడ్ ఐటమ్‌ భామ నటి మలైకా అరోరా. 47 ఏళ్ల వయస్సులోనూ వ్యాయమాలు చేస్తూ చక్కటి శరీరాకృతితో ఆకట్టుకుంటున్నారామె. గతేడాది సెప్టెంబరులో కరోనా సోకి కోలుకున్న అనంతరం తన వర్కవుట్ల అనుభవాల గురించి ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. సామర్థ్యం అంటే ఏమిటనే ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘అందరూ ఎప్పుడూ నన్ను అదృష్టవంతురాలని అంటూ ఉంటారు. నిజమే.. నేను అదృష్టవంతురాలినే. నా జీవితంలో ఎదుర్కొన్న ఎన్నో సంఘటనలకు అలానే భావిస్తా. కానీ ప్రతిదానికి అదృష్టం వర్తించదు కదా! గతేడాది సెప్టెంబరు 5న నాకు కొవిడ్‌ సోకింది. ఎవరైనా కొవిడ్‌ నుంచి కోలుకోవడం తేలికేనని చెప్పినటైతే, వారికి కచ్చితంగా వైరస్‌ను ఎదుర్కొనేందుకు శరీరంలో తగినంత ఇమ్యూనిటీ ఉండాలి లేదా వారికి కొవిడ్‌తో పోరాటం గురించి అవగాహన రాహిత్యమైనా ఉండాలి. నా విషయంలో వైరస్‌ సోకడం తేలికపాటి విషయం కాదు. ఎందుకంటే శారీరకంగా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కనీసం రెండడుగులు వెయ్యాలన్నా భారంగా అనిపించేది. కేవలం కూర్చొని ఉండటం, మంచం నుంచి కిందకి దిగి అడుగులు వేయడం, కిటికీ వద్ద నిలబడటం..ఇవే చేసేదాన్ని. ఇవి చేయాలన్నా కష్టంగా ఉండేది. శరీరమెప్పుడూ నీరసంగా అనిపించేది. శక్తిసామర్థ్యాలు కోల్పోయా. నా కుటుంబ సభ్యులకు దూరంగా క్వారంటైన్‌లో ఉన్నాక సెప్టెంబరు 26న నాకు నెగెటివ్‌ వచ్చింది. చాలా సంతోషంగా అనిపించింది. వైరస్‌ సోకి 10 నెలలు గడిచినా నా శరీరంలో ఇప్పటికీ నీరసమనేది ఉంది. మొదట్లో నా మనసులోని ఆలోచనలకు నా శరీరం సహకరించేది కాదు. శారీరకంగా మళ్లీ దృఢం కానేమోనని భయం వేసేది. కనీసం ఒక్కరోజైనా ఏ పనైనా చేయగలనా అనిపించేంది. ఇక నా వర్కవుట్‌ మొదటి రోజు అయితే ఏదీ చేయలేకపోయా. ఈ విషయంలో మానసికంగా కాస్త ఇబ్బంది పడ్డా. కానీ రెండోరోజు కచ్చితంగా వ్యాయామం చేయాలని నాకు నేనుగా బలంగా అనుకున్నా. అదే సంకల్పంతో మూడు, నాలుగు రోజులు కొనసాగించాను. నెగెటివ్‌ వచ్చిన కొన్నాళ్లకు మళ్లీ ఆరోగ్యంగా ఉన్నాననే భావన నాలో ఏర్పడింది. కరోనా రావడానికి ముందు ఎలా కసరత్తులు చేసేదాన్నో, ఇప్పుడు అలానే చేయగలుగుతున్నా. శ్వాస కూడా సరిగ్గా అందుతుంది. శారీరకంగా, మానసికంగానూ మళ్లీ బలంగా మారాను. ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనల్ని ముందుకు నడిపించేది ఆశ మాత్రమే. కాబట్టి జీవితంలో దాన్ని ఎప్పటికీ కోల్పోకూడదు’’ అంటూ తన అనుభవాలను వివరించారు. కాగా ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆమె తొలిడోస్‌ టీకా పొందారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని