ఓనం పండక్కి.. ‘మరక్కర్‌’ - mohanlal marakkar arabikadalinte simham to release in theatres on august 12 for onam
close
Published : 19/06/2021 09:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఓనం పండక్కి.. ‘మరక్కర్‌’

ఇంటర్నెట్‌డెస్క్‌: థియేటర్లలోకి రాక మునుపే జాతీయ అవార్డుల్లో మెరిసి అందరి దృష్టినీ ఆకర్షించిన సినిమా ‘మరక్కర్‌’. మోహన్‌లాల్‌ కథానాయకుడిగా నటించిన పాన్‌ ఇండియా చిత్రమిది. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్‌ తెరకెక్కించారు. కీర్తి సురేష్, కల్యాణి ప్రియదర్శన్, మంజు వారియర్, అర్జున్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. కరోనా పరిస్థితుల వల్ల గతేడాది నుంచి వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా.. ఇప్పుడు కొత్త విడుదల తేదీని ఖరారు చేసుకుంది. ఈ చిత్రాన్ని ఓనం పండగ సందర్భంగా ఆగస్టు 12న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు మోహన్‌లాల్‌ ట్విటర్‌ వేదికగా కొత్త రిలీజ్‌ పోస్టర్‌ను పంచుకున్నారు. ‘‘మీ ప్రార్థనలు, మద్దతుతో రానున్న ఓనం పండగ సందర్భంగా ‘మరక్కర్‌’ని తీసుకొచ్చేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం’’ అని ఆ పోస్టర్‌కి ఓ వ్యాఖ్యని జత చేశారు. నేవీ కమాండర్‌ కుంజలి మరక్కర్‌ కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. తెలుగులో ‘మరక్కర్‌: అరేబియా సముద్ర సింహం’ పేరుతో విడుదల కానుంది. ఈ చిత్రం ఇటీవల ప్రకటించిన జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఉత్తమ ఫీచర్‌ ఫిల్మ్, బెస్ట్‌ స్పెషల్‌ ఎఫెక్ట్స్, బెస్ట్‌ కాస్ట్యూమ్‌ విభాగాల్లో పురస్కారాలు గెలుచుకుంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని