close

తాజా వార్తలు

Published : 14/01/2021 01:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సూపర్‌స్టార్‌ ఫ్యాన్స్‌కు లారెన్స్‌ క్షమాపణలు

చెన్నై: ప్రముఖ కొరియోగ్రాఫర్‌, దర్శకుడు రాఘవ లారెన్స్‌ తాజాగా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అభిమానులకు క్షమాపణలు తెలిపారు. అసలేం జరిగిందంటే.. అనారోగ్య పరిస్థితుల కారణంగా తాను ఇప్పట్లో రాజకీయ పార్టీని ప్రకటించడం లేదని ఇటీవల రజనీకాంత్‌ అధికారికంగా వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో రజనీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ పలువురు అభిమానులు గత కొన్నిరోజులుగా సోషల్‌మీడియా వేదికగా ట్వీట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. రజనీకి నచ్చజెప్పాలని కోరుతూ.. పలువురు నెటిజన్లు లారెన్స్‌కు సైతం మెస్సేజ్‌లు పెట్టారు.

కాగా, తాజాగా సదరు నెటిజన్ల ట్వీట్లపై లారెన్స్‌ స్పందించారు. ‘తలైవా నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా చూడాలని చాలామంది సోషల్‌మీడియా వేదికగా నాకు మెస్సేజ్‌లు, ట్వీట్లు చేస్తున్నారు. వారందరికీ సమాధానం చెప్పడం కోసమే ఈ ప్రకటన విడుదల చేస్తున్నాను. రజనీ నిర్ణయంతో  మీరు ఎలాంటి బాధను అనుభవిస్తున్నారో అదేవిధమైన నిరాశను నేనూ చవిచూస్తున్నాను. తలైవా రాజకీయాల్లోకి రాకపోవడానికి వేరే ఏదైనా కారణం చెప్పి ఉంటే ఆయన రావాలని మనం వేడుకోవచ్చు. కానీ ఆయన ప్రధాన కారణం అనారోగ్యం. ఒకవేళ మనవల్ల ఆయన తన నిర్ణయాన్ని మార్చుకుని.. మళ్లీ అనారోగ్యానికి గురైతే జీవితాంతం మనం సిగ్గుతో బాధపడాల్సి ఉంటుంది. రాజకీయాల్లోకి అడుగుపెట్టనప్పటికీ ఆయన ఎప్పటికీ నా గురువే. ఆయన ఆరోగ్య పరిస్థితుల గురించి నాకు బాగా తెలుసు. కాబట్టి ఆయన ఎప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనందరం దేవుడిని ప్రార్థిద్దాం’ అని లారెన్స్‌ వివరించారు.

ఇదీ చదవండి

ఆ డైలాగ్‌లన్నీ సింగిల్‌ టేక్‌లో చెప్పింది!


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన