వ్యక్తిగత కారణాల వల్ల విరామం‌ తీసుకున్నా: మమత - my constant and rather consistent intervals from the industry due to my own personal reasons
close
Updated : 23/11/2020 14:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వ్యక్తిగత కారణాల వల్ల విరామం‌ తీసుకున్నా: మమత

హైదరాబాద్‌: ‘యమదొంగ’ చిత్రంతో ధనలక్ష్మిగా తెలుగువారికి చేరువైన మలయాళీ భామ మమతా మోహన్‌దాస్‌. మలయాళంతోపాటు తెలుగు, తమిళ చిత్రాల్లో నటించిన ఈ భామ.. పలు సందర్భాల్లో సినిమాల నుంచి విరామం‌ తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాదితో మమతా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 15 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఆమె తన సినీ కెరీర్‌ గురించి స్పందించారు.

‘సినీ కెరీర్‌ను ఆద్యంతం ఎంజాయ్‌ చేస్తున్నాను. కెరీర్‌ ప్రారంభంలోనే అనుకున్న సక్సెస్‌ రావడం కష్టమని అప్పట్లో నాకు తెలిసింది. పలు వ్యక్తిగత కారణాల వల్ల సినిమాల నుంచి తరచూ విరామం‌ తీసుకున్నాను. దానివల్ల మరిన్ని విభిన్నమైన పాత్రల్లో నటించాలనే భావన నాలో కలిగింది. అలా మాంచి కథలతో ప్రేక్షకులను అలరించాలని భావిస్తున్నాను. ఈ ఏడాది ఆరంభంలో ఓ ప్రాజెక్ట్‌ నిర్మించాలనుకున్నా. మార్చి నెలలో ప్రీ ప్రొడక్షన్‌ పూర్తి చేసి మేలో షూటింగ్‌ ప్రారంభించాలని అనుకున్నాం. ఈలోగా కరోనా వల్ల పరిస్థితులన్నీ మారిపోయాయి. ఒకవేళ ప్రీ ప్రొడక్షన్‌ ప్రారంభించాక లాక్‌డౌన్‌ వచ్చుంటే మేము మరింత ఇబ్బందిపడేవాళ్లం. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మా ప్రాజెక్ట్‌ను కొంతకాలంపాటు వాయిదా వేస్తున్నాం’ అని మమతా మోహన్‌దాస్‌ తెలిపారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని