శైలజా టీచర్‌కు సినీ తారల మద్దతు - parvathy and anupama parameswaran supports shailaja teacher call out kerala cms decision
close
Published : 20/05/2021 01:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శైలజా టీచర్‌కు సినీ తారల మద్దతు

తిరిగి మంత్రివర్గంలోకి తీసుకోవాలంటూ డిమాండ్‌

తిరువనంతపురం: కేరళ మంత్రివర్గంలో కేకే శైలజ (శైలజ టీచర్‌)కు చోటు కల్పించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రాణాంతక నిపా వైరస్‌, కరోనా మొదటి దశకు అడ్డుకట్ట వేసి అంతర్జాతీయంగా ప్రశంసలందుకున్న ఆమెకు తాజా మంత్రివర్గంలో చోటివ్వని నేపథ్యంలో పలువురు ప్రముఖ సినీ తారలు ఆమెకు అండగా నిలుస్తున్నారు. నిత్యం మహిళల హక్కులపై ప్రశ్నించే మలయాళీ నటి పార్వతితోపాటు అనుపమా పరమేశ్వరన్‌, మాళవిక మోహనన్‌ ట్విటర్‌ వేదికగా సీఎం పినరయి విజయన్‌ను ప్రశ్నించారు.#BringBackShailajaTeacher, #BringOurTeacherBack లాంటి యాష్‌ట్యాగ్‌లను జతచేస్తూ పలు ట్వీట్లు చేశారు. అనేక మంది నెటిజన్లు సైతం ఆమెను తిరిగి కేబినెట్‌లోని తీసుకోవాలని కోరుతున్నారు. 

శైలజ టీచర్‌ ఫొటోను పంచుకున్న పార్వతి పలు ట్వీట్లు చేశారు. మంత్రివర్గంలో ఆమె కచ్చితంగా ఉండాల్సన వ్యక్తి అన్నారు. శైలజకు అన్యాయం జరిగిందని.. రాష్ట్ర ప్రజలకు అలాంటి ఉత్తమమైన నేత అవసరమన్నారు. మట్టనూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె 60 వేల భారీ మెజారిటీతో విజయం సాధించారని, కేరళలో ఉన్న 140 స్థానాల్లో ఇదే అత్యధికమని తెలిపారు. అయినా ఆమె కోసం పోరాడాల్సి వస్తోందని వాపోయారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వం ప్రశ్నార్థక స్థితిలో నిలిచిందని పార్వతి పేర్కొన్నారు. ‘మాస్టర్‌’ సినిమా నటి మాలవిక మోహనన్‌ స్పందిస్తూ.. ఇలాంటి విపత్కర సమయంలో ఉత్తమ ఆరోగ్య శాఖ మంత్రికి మంత్రివర్గంలో చోటు కల్పించలేదని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అసలు పినరయి విజయన్‌కు ఏమైంది అని ప్రశ్నించారు. ఆరోగ్య శాఖ మంత్రిగా ఉత్తమ సేవలందించినట్లు సూచించే కేకే శైలజ ఫొటోను పంచుకున్న అనుమప పరమేశ్వరన్‌ ఆమెకు మద్దతుగా నిలిచారు. #BringBackShailajaTeacher అని యాష్‌ట్యాగ్‌ జోడిస్తూ ట్వీట్‌ చేశారు.

కేరళలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షపార్టీ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌ తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ నాయకత్వంలో మంగళవారం 21మంది కొత్త మంత్రులతో మంత్రివర్గం ఏర్పాటైంది. దాంట్లో ఆరోగ్య శాఖ మాజీ మంత్రి కేకే శైలజకు చోటు దక్కలేదు. మొదటి దఫా ఆరోగ్య మంత్రిగా 2018లో మే నెలలో ప్రాణాంతక నిపా వైరస్‌ను నియంత్రించేందుకు పలుచర్యలు చేపట్టారు. నిపా వైరస్‌ను పారదోలడంతోపాటు అనంతరం మానవాళి ఉనికికే సవాలు విసురుతున్న కరోనా తొలిదశకు అడ్డుకట్ట వేసి అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్నారు. ఆమె రెండోసారి ఆరోగ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని ప్రతి ఒక్కరు భావించారు. కానీ అంచనాలను తలకిందులు చేస్తూ.. సీపీఎం తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 
 


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని