close

తాజా వార్తలు

Updated : 08/08/2020 18:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రశాంత్‌ వర్మ కొత్త సినిమా ‘జాంబీ రెడ్డి’

ఇంటర్నెట్‌ డెస్క్‌: హారర్‌ జోనర్‌లో జాంబీ చిత్రాలు ఒకటి. హాలీవుడ్‌లో ఎక్కువగా ఈ సినిమాలు వస్తుంటాయి. తమిళ్‌లో ‘మిరుతన్‌ (తెలుగులో యమపాశం)’ తప్ప పెద్దగా జాంబీ చిత్రాలు భారత్‌లో తెరకెక్కలేదు. ఇప్పుడు నేరుగా  తెలుగులో ఓ జాంబీ చిత్రం రాబోతుంది. అదే ‘జాంబీ రెడ్డి’. తొలి సినిమా ‘అ’తోనే విభిన్నచిత్ర దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్‌ వర్మ.. ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. రెండో చిత్రంగా ఆయన తీసిన ‘కల్కి’ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో మూడో సినిమా మరింత కొత్తగా ఉండాలని ప్రశంత్‌ వర్మ ఏకంగా జాంబీ జోనర్‌ను ఎంచుకున్నారు.

తాజాగా ‘జాంబీరెడ్డి ’ మోషన్‌ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. శ్మశాన వాతావరణం చూపిస్తూ.. మ్యూజిక్‌తో మోషన్‌ పోస్టర్‌తోనే ప్రేక్షకులను భయపెట్టిస్తున్న చిత్రబృందం.. మరి ఈ సినిమాను ఏ రేంజ్‌లో తీస్తుందో చూడాలి. కరోనా నేపథ్యంలో సినిమా చేస్తానని ప్రశాంత్‌ వర్మ ఇది వరకే వెల్లడించారు. ఈ చిత్రం నిజజీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. దీంతో కరోనాకి, జాంబీలకు సంబంధం ఏంటీ?నిజజీవితంలో జాంబీ ఘటనలు జరిగాయా?వంటి ప్రశ్నలు చిత్రంపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఆపిల్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై రాజశేఖర్‌ వర్మ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మార్క్‌ కే రాబిన్‌ సంగీతం సమకూరుస్తున్నారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటించనున్నారు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.