Puri Musings: అందుకే నట్స్‌, సీడ్స్‌ని నానబెట్టి తినాలి - puri musings about nuts seeds puri jagannadh
close
Updated : 14/08/2021 06:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Puri Musings: అందుకే నట్స్‌, సీడ్స్‌ని నానబెట్టి తినాలి

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘యాపిల్‌ విత్తనాల్ని ఎక్కువగా తింటే మనిషి చనిపోయే ప్రమాదం ఉంది’ అని తెలిపారు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌. ‘పూరి మ్యూజింగ్స్‌’ పేరిట ఆయన వివిధ అంశాలపై వీడియోలు రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. తాజా వీడియోలో ‘నట్స్‌, సీడ్స్‌, గ్రెయిన్స్‌’ గురించి చెప్పుకొచ్చారు. ఆ సంగతులు ఆయన మాటల్లోనే...

‘‘క్యాష్యూ నట్స్‌, వాల్‌నట్స్‌, హాజల్‌ నట్స్‌, ఆల్మండ్స్‌.. వీటన్నింటినీ నీటిలో నానబెట్టి, ఆ తర్వాత తినాలి. ఎందుకంటే? నట్స్‌, సీడ్స్‌, గ్రెయిన్స్‌ని మనం ఎప్పుడూ తక్కువ అంచనా వేస్తాం. ఏవో అక్కడ పడి ఉన్నాయి, తింటే మంచిదట! అక్కడి వరకే తెలుసు. కానీ, వాటికి బ్రెయిన్‌ ఉంటుందని, అవీ ఆలోచిస్తాయని తెలీదు. వీటి లక్ష్యం ఏంటంటే.. మరో చోట మొలకెత్తాలి. తమ జాతిని పెంచుకోవాలి. దానికోసం ఎన్నాళ్లైనా ఎదురుచూస్తాయి. ఎన్నేళ్లైనా బతుకుతాయి. ఇజ్రాయెల్‌లో జూడియన్‌ పామ్‌ సీడ్‌ దొరికింది. దాని వయసు 2000 సంవత్సరాలు. 2005లో దాన్ని మట్టిలోపెట్టి నీళ్లు పోశారు. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ మొలకెత్తింది. 30-40 ఫారన్‌ హీట్‌ ఉష్ణోగ్రత వద్ద ఉంచితే అవి ఎన్నాళ్లయినా ఉంటాయి. మనకి 32 వేల సంవత్సరాల క్రితంనాటి విత్తనాలు దొరికేవి. లక్ష సంవత్సరాల క్రితంనాటి గ్రెయిన్స్‌ దొరికేవి. ఈ సీడ్స్‌, నట్స్‌ మనుషుల కంటే ముందు పుట్టాయి. మనకంటే చాలా తెలివైనవి. మనం నాలుగు రోజులు అన్నం తినకపోతే చస్తాం. అవి అలా కాదు ఏళ్ల తరబడి తిండి లేకుండా బతకాలి. అలా బతికేందుకు చుట్టూ స్కిన్‌ని తయారుచేసుకుంటాయి. ఆ స్కిన్‌లో దాక్కుని ఉంటాయి. జంతువుల నుంచి ప్రాణ రక్షణ కోసం వాటి స్కిన్‌ చుట్టూ టాక్సిన్స్‌ రూపొందించుకుంటాయి. సీడ్‌ చుట్టూ ఫిటిక్‌ యాసిడ్‌ ఉంటుంది. అది తింటే మనకు మంచిది కాదు. అందుకే వీటిని నీళ్లలో నానబెట్టి, తినాలి’’.

‘‘యాపిల్, చెర్రీల విత్తనాలు తింటే మన కడుపులో సైనేడ్‌ ఉత్పన్నమవుతుంది. 150 యాపిల్‌ విత్తనాల్ని తింటే మనం చనిపోయే ప్రమాదం ఉంది. చెట్లు మనకి పండ్లని ఎందుకిస్తాయో తెలుసా? వాటి జాతిని పెంచుకోవడానికి. అందుకే పండ్లని ఉచితంగా అందిస్తాయి. వాటి ద్వారా గ్లూకోజ్‌, ఫైబర్‌ ఇస్తాయి. ఆ పండ్లని మనుషులు, జంతువులు, పక్షులు తిని, విసర్జిస్తాయి. అలా చెట్లు మళ్లీ తమ జాతిని పెంచుకుంటాయి. ఇంకో విషయం ఏంటంటే.. పచ్చి వాటిని అసలు తినొద్దు. అందులో విషం ఉంటుంది. అందుకే పండినవే తినండి. ఈసారి నట్స్‌, సీడ్స్‌ కనిపిస్తే కొరకొద్దు. చాలా జాగ్రత్తగా ఉండండి’’ అని సూచించారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని