ఉపాసన సీక్రెట్‌ బయటపెట్టిన రకుల్‌ - rakul reveals the secret of upasana fitness
close
Published : 02/04/2021 01:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఉపాసన సీక్రెట్‌ బయటపెట్టిన రకుల్‌

నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో

హైదరాబాద్‌: కథానాయకుడు రామ్‌చరణ్‌ తేజ్‌ సతీమణి ఉపాసనకు సంబంధించిన ఓ రహస్యాన్ని నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌ బయటపెట్టారు. ఫిట్‌నెస్‌, హెల్తీ లైఫ్‌స్టైల్‌ పట్ల ప్రతిఒక్కరికీ అవగాహన కల్పించే విధంగా ‘యువర్‌ లైఫ్‌’ వెబ్‌సైట్‌ను ఉపాసన నడుపుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌ సెలబ్రిటీ చెఫ్‌గా విచ్చేసి ‘పాలకూర బఠాణి పలావ్‌’ తయారీ విధానాన్ని చూపించారు. అంతేకాకుండా ఉపాసన ఫిట్‌నెస్‌ రహస్యాన్ని రకుల్‌ బయటపెట్టారు.

ఉప్సీ తరచూ డైట్‌లో ఉంటుందని అస్సలు రైస్‌ తినడానికి ఆసక్తి చూపించదని ఆమె తెలిపారు. ‘ఉప్సీ.. ‘పాలకూర బఠాణి పలావ్‌’ సిద్ధం చేసుకున్నట్లు అయితే తప్పకుండా నువ్వు కూడా రైస్‌ తినొచ్చు. ఎందుకంటే ఇందులో రైస్‌ చాలా తక్కువగా పాలకూర, బఠాణి ఎక్కువగా ఉంటుంది. అలాగే వర్కౌట్లు కూడా ఎక్కువగా చేయాల్సిన అవసరం ఉండదు. నేను ప్రతిరోజూ తినే ఆహారం ఇదే’’ అని రకుల్‌ తెలిపారు. ఇప్పటికే ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న సమంత, రష్మిక.. తమ ఆరోగ్య రహస్యాలను బయటపెట్టారు. అలాగే ఓట్స్‌ క్యారెట్‌ ఇడ్లీ, గాజర్‌ కా హల్వా తయారు చేసే విధానాన్ని వారిద్దరూ చూపించారు. ఇక రకుల్‌ సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె చేతిలో టాలీవుడ్, బాలీవుడ్‌ వరుస చిత్రాలున్నాయి. తెలుగులో క్రిష్‌ డైరెక్షన్‌లో వైష్ణవ్‌ తేజ్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రంలో రకుల్‌ కథానాయిక. ‘సర్దార్‌ కా గ్రాండ్‌ సన్‌’, ‘అయలాన్‌’, ‘ఎటాక్‌’, ‘మే డే’, ‘థ్యాంక్‌ గాడ్‌’ల్లో రకుల్‌ నటిస్తున్నారు.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని