రామ్‌ కొత్త సినిమా దర్శకుడికి చిక్కులు - ram film with lingusamy in trouble as gnanavel raja files complaint against the director
close
Published : 26/06/2021 15:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రామ్‌ కొత్త సినిమా దర్శకుడికి చిక్కులు

సినిమా పట్టాలెక్కడానికి ఆలస్యమవుతుందా?

హైదరాబాద్‌: రామ్‌ కథానాయకుడిగా కోలీవుడ్‌ డైరెక్టర్‌ లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా డైరెక్టర్‌ లింగుస్వామికి చిక్కులు ఎదురయ్యాయి. కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాత జ్ఞాన్‌వేల్‌ రాజా ఆయనపై తెలుగు నిర్మాతల మండలికి, తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌కు ఫిర్యాదు చేశారు. తనకు చెందిన స్టూడియో గ్రీన్‌ బ్యానర్‌లో ఓ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తానని మాటిచ్చి, లింగుస్వామి భారీగా డబ్బులు తీసుకున్నారని ఆయన ఆరోపించారు. 

‘స్టూడియో గ్రీన్‌ బ్యానర్‌లో ఓ భారీ ప్రాజెక్ట్‌ తెరకెక్కిస్తానని లింగుస్వామి గతంలో నాకు మాటిచ్చారు. మాట ప్రకారమే నా వద్ద నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బు కూడా తీసుకున్నారు. ఇప్పటివరకూ మా బ్యానర్‌పై ఎలాంటి చిత్రాన్ని ఆయన ఓకే చేయలేదు. అంతేకాకుండా, ఇప్పుడు ఆయన రామ్‌తో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. మా డిమాండ్‌ ఒక్కటే.. లింగుస్వామి ముందు మా బ్యానర్‌లో సినిమా చేయాలి. ఆ తర్వాతే కొత్త ప్రాజెక్టులోకి వెళ్లాలి. ఆయన రామ్‌తో సినిమా చేయడంపై మాకెలాంటి సమస్య లేదు’ అని జ్ఞాన్‌వేల్‌ వివరించారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని