బోయపాటి దర్శకత్వంలో రామ్‌? - ram next project directed by boyapati
close
Published : 21/03/2021 02:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బోయపాటి దర్శకత్వంలో రామ్‌?

ఇంటర్నెట్‌ డెస్క్: యువ కథానాయకుడు రామ్‌ పోతినేని ‘ఇస్టార్ట్‌ శంకర్‌’ ఇచ్చిన విజయంతో ఉత్సహంగా ఈ ఏడాది ‘రెడ్‌’ చిత్రంలో నటించి అలరించారు. ప్రస్తుతం తమిళ దర్శకుడు ‘ఆవారా’ ఫేమ్‌ లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ‘ఉప్పెన’ చిత్ర కథానాయిక కృతి శెట్టి, రామ్‌ సరసన నటిస్తోంది. ఈ చిత్రం తర్వాత మాస్‌ యాక్షన్‌ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీనుతో ఓ సినిమా చేయనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యే రామ్‌కి - బోయపాటి కథ చెప్పాడట. అందుకు రామ్ కూడా సానుకూలత తెలిపారని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. బోయపాటి శ్రీను - ప్రస్తుతం బాలకృష్ణతో ఓ సినిమా చేస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందరెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్‌ జరుపుకుంటోంది. ఇది పూర్తికాగానే రామ్‌ - బోయపాటిల చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందట. 


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని